Vinayaka Vrata Kalpam - వినాయక వ్రతకల్పం

| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |

(vinayaka chavithiganapathi pujavinayaka vrata kalpamవినాయక చవితిగణపతి పూజ,గణపతి పూజా విధానంవినాయక వ్రతకల్పం)
 1)  ఆచమనం - Achamanam
ఓం కేశవాయ స్వాహాః
నారాయణాయ స్వాహాః
మాధవాయ స్వాహాః
(అని మూడుసార్లు చేతిలో నీరు వేసుకొని త్రాగవలెను)
గోవిందాయ నమః
విష్ణవే నమః
మధుసూదనాయ నమః
త్రివిక్రమాయ నమః
వామనాయ నమః
శ్రీధరాయ నమః
హృషీకేశాయ నమః
పద్మనాభాయ నమః
దామోదరాయ నమః
సంకర్షణాయ నమః
వాసుదేవాయ నమః
ప్రద్యుమ్నాయ నమః
అనిరుద్దాయ నమః
పురుషోత్తమాయ నమః
అధోక్షజాయ నమః
నారసింహాయ నమః
అచ్యుతాయ నమః
ఉపేంద్రాయ నమః
హరయే నమః
శ్రీ కృష్ణాయ నమః
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
సంకల్పం
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
 ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే
ఓం అపవిత్రః పవిత్రోవా సర్వా వస్థాం గతోపివా
యస్స్మరేత్పుండరీ కాక్షం సబాహ్యాభ్యంతరం శుచిః
శ్రీ గోవింద గోవింద ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓంభూః ఓం భువః ఓగ్ ం శివః ఓం మహః ఓంజనః ఓంతపః ఓ గ్ం సత్యం ఓంతత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఓం ఆపోజ్యో తీరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. ప్రాణాయామం  (మూడు సార్లు లోపలికి గాలి పీల్చి నెమ్మదిగా వదలడం) చేసి దేశకాలములను స్మరించి సంకల్పం చేయవలెను. మమోపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరత వర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన జయ నామ సంవత్సరే దక్షిణాయనే వర్షర్తౌ భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్ద్యాం వాసరః శుక్రవాసర యుక్తాయాం శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ, విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీమాన్ ... గోత్రః ...నామధేయః (ధర్మ పత్నీ సమేతః) మమ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం సిద్ది వినాయక ప్రీత్యర్థం ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే
భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణమ్ విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహంభజే
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవమ్ ధ్యాయేత్సిద్ధి వినాయకమ్
ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం

0 comments:

Post a Comment