(vinayaka chavithi, ganapathi puja, vinayaka vrata kalpam, వినాయక చవితి, గణపతి పూజ,గణపతి పూజా విధానం, వినాయక వ్రతకల్పం)
11) విఘ్నేశ్వరుని మంగళహారతులు
శ్రీ శంభు తనయునకు సిద్ధి గణనాధునకు వాసిగల దేవతావంద్యునకు ఆ సరస విద్యలకు ఆది గురువైనట్టి భూసురోత్తమ లోకపూజ్యునకు జయమంగళం నేరేడు మారేడు నెలవంక మామిడి దూర్వార చెంగల్వ ఉత్తరేణు వేరువేరుగా తెచ్చి వేడ్కతో పూజింతు పర్వమున దేవగణపతికి నిపుడు జయమంగళం॥
సురుచిరముగ భాద్రపద శుద్ధ చవితియందు పొసగ సజ్జనులయే పూజగొల్తు శ శి చూడరాకున్న చేకొంటినొక వ్రతము పర్వమున దేవగణపతికినిపుడు జయమంగళం॥
పానకము వడపప్పు పనసమామిడి పండ్లు దానిమ్మ, ఖర్జూర, ద్రాక్షపండ్లు, తేనెతో మాగిన తీయ మామిడిపండ్లు, మాకు బుద్ధినిచ్చు దేవ గణపతికినిపుడు జయమంగళం॥
ఓ బొజ్జగణపయ్య నీబంటు నేనయ్య ఉండ్రాళ్ళమీదికి దండుపంపు కమ్మని నెయ్యియు కడు ముద్దపప్పును బొజ్జ విరుగగ దినుచు పొరలు గొనుచు జయమంగళం వెండిపళ్ళెరములో వేయివేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి మెండుగను హారములు వేసికొని దండిగా నీకిత్తు ధవళారతి జయమంగళం॥
పువ్వుల నినుగొల్తు పుష్పాలనినుగొల్తు గంధాల నినుగొల్తు కస్తూరినీ ఎప్పుడూ నినుగొల్తు ఏకచిత్తంబున పర్వమున దేవగణపతికినిపుడు జయమంగళం॥
మంగళము మంగళము మార్తాండతేజునకు మంగళము సర్వజ్ఞవందితునకు మంగళము ముల్లోకమహిత సంచారునకు మంగళము దేవ గణపతికినిపుడు జయమంగళం॥
సిద్ధివిఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజింతు ఒనరంగ నిరువదియొక్క పత్రి దానిమ్మ మరువంబు దర్భ విష్ణుక్రాంత యుమ్మెత్త దుర్వార యుత్తరేణి జయమంగళం॥
కలువలు మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారు జాజి బలురక్కసి జమ్మి దాసాని పువ్వు గరికి మాచీపత్రి మంచి మొలక జయమంగళం॥
అగరు గంధాక్షత ధూపదీపనైవేద్య తాంబూల పుష్పోపహారములును భాద్రపద శుద్ధ చవితిని కుడుములు నానుబాలు ఉండ్రాళ్ళు పప్పు జయమంగళం॥
పాయసము జున్ను తేనెయు భక్తిమీర కోరిపూజింతు నిన్నెపుడు కోర్కెలలర జయమంగళం॥
బంగారు చెంబుతో గంగోదకము తెచ్చి సంగతిగ శివునకు జలకమార్చి మల్లెపూవులు తెచ్చి మురహరిని పూజింతు రంగైన నా ప్రాణలింగమునకు జయమంగళం॥
పట్టుచీరలు మంచి పాడిపంటలు కలిగి ఘనముగా కనకములు కరులు హరులు ఇష్ట సంపదలిచ్చి ఏలినస్వామికి పట్టభద్రుని దేవగణపతికినిపుడు జయమంగళం॥
ముక్కంటితనయుడని ముదముతో నేనును చక్కనైన వస్తుసమితి గూర్చి నిక్కముగ మనమును నీయందే నీనిల్పి ఎక్కుడగు పూజలాలింపజేతు జయమంగళం॥
మల్లెలా మొల్లలా మంచి సంపెంగలా చల్లనైన గంధ సార ములను ఉల్లమలరగ మంచి ఉత్తమవు పూజలు కొల్లలుగ నేజేతు కోరి విఘ్నేవ జయమంగళం॥
దేవాధిదేవునకు దేవతారాధ్యునకు దేవేంద్రవంద్యునకు దేవునకును దేవతలు మిముగొల్చి తెలిసి పూజింతురు భవ్యుడగు దేవగణపతికినిపుడు జయమంగళం॥
చెంగల్వచే మంతి చెలరేగి గన్నేరుతామరలు తంగేడు తరచుగానూ పుష్పజాతులు తెచ్చి పూజింతునేనెపుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను జయమంగళం॥
మారేడు మామిడి మాదీఫలంబులు ఖర్జూర పనసలను కదళిక ములు నేరేడు నెలవంది టెంకాయ తేనెయు చాలగానిచ్చెదరు చనువుతోనూ జయమంగళం॥
ఓ బొజ్జ గణపతి ఓర్పుతో రక్షించి కాచిమమ్మేలుమీ కరుణతోనూ మాపాల గలవని మహిమీదనెల్లపుడు కొనియాడుచుందుము జయమంగళం॥







0 comments:
Post a Comment