(vinayaka chavithi, ganapathi puja, vinayaka vrata kalpam, వినాయక చవితి, గణపతి పూజ,గణపతి పూజా విధానం, వినాయక వ్రతకల్పం)
13) వినాయకుని జననం
అతి త్వరలో తన భర్త తిరిగి కైలాసానికి వస్తున్నాడని తెలుసుకున్న పార్వతి ఉత్సాహంగా తలంటు పోసుకోవడానికి తయారయింది. తన ఒంటి మీది సున్నిపిండిని నలిపి తీసి, ఆ నలుగుపిండితో ఓ చిన్నపిల్లవాడి బొమ్మను చేసి దానికి ప్రాణం పోసి చెప్పింది.
‘‘కుమారా! నువ్వు కాపలా ఉండి, లోపలికి ఎవరినీ రానీయకు’’
ఆ బాలుడు అందుకు ఒప్పుకుని సింహద్వారం వద్దకు వెళ్లాడు. పార్వతి స్నానం ముగించుకుని, అనేక నగలను ధరించి, భర్త కోసం ఆత్రంగా వేచి చూడసాగింది.
కైలాసం చేరుకున్న శివుడు లోపలకు వెళ్లబోతూంటే, పార్వతి కాపుంచిన పిల్లవాడు ఆయన్ని అడ్డగించాడు. శివుడికి కోపం వచ్చి త్రిశూలంతో ఆ పిల్లవాడి తలను తెక్కోసి లోపలకు వెళ్లాడు.
పార్వతి శివుడికి ఎదురెళ్లి, ఆహ్వానించి ఆయనకు కాళ్లు కడుక్కోవడానికి, తాగడానికి నీళ్లిచ్చి పతివ్రతాధర్మం ప్రకారం పూజించింది.
చాలాకాలం తర్వాత కలుసుకున్న వారిద్దరూ అనేక విషయాలు ముచ్చటించుకున్నారు. వారి సంభాషణలో ద్వారం దగ్గరి బాలుడి ప్రసక్తి వచ్చింది. పార్వతి జరిగింది చెప్పగానే శివుడు విచారిస్తూ చెప్పాడు.
‘‘అయ్యో! నేను వాడి తల నరికేశానే?’’
ఇద్దరూ కొద్దిసేపు బాధపడ్డాక శివుడికి గజాసురుడికిచ్చిన వరం గుర్తుకొచ్చి, ఆ గజాసురుడి తలను తెచ్చి, మర ణించిన ఆ బాలుడికి అతికించి, ప్రాణం పోసి చెప్పాడు.
‘‘వత్సా! నీకు గజాననుడు అనే పేరు పెడుతున్నాను’’
పార్వతి గజాననుడిని ప్రేమగా పెంచుకోసాగింది. గజాననుడు కూడా తన తల్లిదండ్రులతో ప్రేమగా మెలగుతూ పెరగసాగాడు. అనింద్యుడనే ఎలుకను తన వాహనంగా చేసుకుని దాన మీద తిరగసాగాడు.
మరికొంత కాలానికి పార్వతీ పరమేశ్వరులకు ఒక కొడుకు పుట్టాడు. అతడికి ‘కుమారస్వామి’ అనే పేరు పెట్టారు. మహాబలశాలి అయిన కుమారస్వామి నెమలిని తన వాహనంగా చేసుకున్నాడు.







0 comments:
Post a Comment