(vinayaka chavithi, ganapathi puja, vinayaka vrata kalpam, వినాయక చవితి, గణపతి పూజ,గణపతి పూజా విధానం, వినాయక వ్రతకల్పం)
9) ప్రార్థన
వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా, వాయన దానం॥
గణేశ ప్రతిగృ్ణతు గణేశో వైదదాతిచ, గణేశస్తారకో ద్వాభ్యాం గణేశయా నమోనంః॥ప్రతిగ్రహ మంత్రః॥
వినాయకస్య ప్రతిమాం వస్త్రయుగ్మ సమన్వితాం ॥తుభ్యం దాస్యామి విప్రేంద్ర యథోక్త ఫలదోభవ ప్రతిమా దానం॥
ప్రసీద దేవ దేవేశ ప్రసిద్ధ గణనాయక, ప్రదక్షిణం కరోమి త్వాం ఈశ పుత్ర నమోస్తుత ॥
యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే , ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ॥యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు ॥న్యూనం సంపూర్ణతాం యాంతి సద్యో వందే తవమచ్చుత వరదో భవంతు ॥
పూజా విధానం సంపూర్ణం
------
ప్రార్థన
తొండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్
కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ త నయా యోయి గణాధిపా నీకు మ్రొక్కెదన్ ॥
తొలుతనవిఘ్నమస్తంచు ధూర్జటి నందన నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయుమయ్య నిను ప్రార్థన చేసెదనేకదంత నా
వలపలి చేతి ఘంటమున వాక్కుననెప్పుడు బాయకుండు నీ
తలపున నిన్ను వేడెదను దైవ గణాధిపా! లోక నాయకా!
తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని దలచిన పనిగా
దలచితినే హేరంబుని దలచితినా విఘ్నములను తొలగించుటకున్॥
అటుకులు కొబ్బరి పలుకులు చిటి బెల్లము నానుబ్రాలు చెరకురసంబున్
నిటలాక్షునగ్రసుతునకు బటుతరముగ విందుసేతు ప్రార్థింతు మదిన్ ॥







0 comments:
Post a Comment