iTTipratApamu gala - ఇట్టిప్రతాపము గల

ఇట్టిప్రతాపము గల (రాగం: ) (తాళం : )
ఇట్టి ప్రతాపముగల యీతని దాసులనెల్ల
కట్టునా కర్మములెల్ల గాలి బోవుగాక ||

యెలమి జక్రాయుధున కెదురా దానవులు
తొలగ కెందుచొచ్చిన దుండించుగాక
ఇల గరుడధ్వజుపై నెక్కునా విషములు
కలగి నీరై పారి గాలి బోవుగాక ||

గోవర్దనధరునిపై కొలువునా మాయలు
వేవేలుదునుకలై విరుగుగాక
కేవలుడచ్యుతునొద్ద గీడు చూపగలవా
కావరమై తా దానె గాలి బోవుగాక ||

వీరనారసింహునకు వెరపులు గలవా
దూరాన గగ్గులకాడై తొలగుగాక
కోరి యీ శ్రీవేంకటేశు గొలిచితి మిదివో
కారుకొన్నపగలెల్ల గాలి బోవుగాక ||
iTTipratApamu gala (Raagam: ) (Taalam: )
iTTipratApamu gala Itani dAsulanella
kaTTunA karmamulu gAlibOvugAka||

yelami cakrAyudhuna kedurA dAnavulu
tolaga keMdu coccina duMDiMcu gAka
ila garuDa dhvajupai nekkunA viShamulu
kalagi pAri gAlibOvu gAka||

gOvardhanadharunipai koluvunAmAyalu
vEvElu dunakalai virugugAka
kEvaluDacyutu nodda gIDucUpagalavA
kAvaramai tAdAnE gAlibOvugAka||

vIra nArasiMhunaku verapulu galavA
dUrAna gaggulakADai tolagu gAka
kOri I SrIvEMkaTESu goliciti midivO
kArukonna pagalella gAlibOvu gAka ||

0 comments:

Post a Comment