అడుగరే యాతనినే -aDugarE yAtaninE

అడుగరే యాతనినే (రాగమ్: ) (తాలమ్: )
ప|| అడుగరే యాతనినే అంగనలాలా | గుడిగొని తానే వట్టి గొరబాయగాక ||

చ|| యెదురాడేదాననా యెంతటి పనికినైనా | పదరి తానే మారువలికీ గాక |
తుదమీఱేదాననా దూరైయంత దిరిగినా | ముదమునదానే మారుమలసీగాక ||

చ|| కక్కసించే దాననా కడలెంత దొక్కినాను | వెక్కసీడై తానై యిటు వెలసీగాక |
మొక్కలపుదాననా ముందు వెనకెంచితేను | పక్కనె దానె ముంచి పంతమాడీగాక ||

చ|| తడబడేదాననా తనరతి వేళను | బడిబడి దానే చొక్కి భ్రమసీగాక |
అడిగేటి దాననా అందరిలో నన్నుగూడి | అడరి శ్రీవేంకటేశు డాదరించీగాక ||

aDugarE yAtaninE (Raagam: ) (Taalam: )
pa|| aDugarE yAtaninE aMganalAlA | guDigoni tAnE vaTTi gorabAyagAka ||

ca|| yedurADEdAnanA yeMtaTi panikinainA | padari tAnE mAruvalikI gAka |
tudamIrxEdAnanA dUraiyaMta diriginA | mudamunadAnE mArumalasIgAka ||

ca|| kakkasiMcE dAnanA kaDaleMta dokkinAnu | vekkasIDai tAnai yiTu velasIgAka | mokkalapudAnanA muMdu venakeMcitEnu | pakkane dAne muMci paMtamADIgAka ||

ca|| taDabaDEdAnanA tanarati vELanu | baDibaDi dAnE cokki BramasIgAka |
aDigETi dAnanA aMdarilO nannugUDi | aDari SrIvEMkaTESu DAdariMcIgAka ||

అడుగరే చెలులాల - aDugarE celulAla

అడుగరే చెలులాల (రాగమ్: ) (తాలమ్: )
ప||అడుగరే చెలులాల అతనినే యీ మాట వుడివోని తమకాన నుండ బోలు తాను||

చ||వేడుక గలప్పుడే వెస నవ్వు వచ్చు గాక వాడి వున్నప్పుడు తలవంపులే కావా||
యేడనో సతుల చేత యేపులబడి రాబోలు యీడ నే జెనక గాను యిటులా నుండునా||

చ||ఆసల గూడినప్పుడె ఆయాలు గరగు గాక పాసి వున్నప్పుడు తడబాటులే కావా||
బేసబెల్లి వలపుల పిరి వీకై రాబోలు వేన నే బెట్టగాను సిగ్గువడి వుండునా||

చ||సరస మాడి నప్పుడె చవులెల్లా బుట్టు గాక గొరబైన యప్పుడు కొరతలే కావా||
యిరవై శ్రీ వేంకటేశు డింతలోనె నన్ను గూడె వరుస నిందాకా నిటువలె జొక్కకుండునా||

aDugarE celulAla (Raagam: ) (Taalam: )
pa|| aDugarE celulAla atninE yI mATa vuDivOni tamakAna nunDa bOlu tAnu ||

ca|| vEDuka galappudE veela navvu vaccu nAka vADi vunnappuDu talavampulE kAvA |
yEDanO satula cEta yEpulabaDi rAbOlu yIDanE jenaka gAnu yiTulA nunDunA ||

ca|| Asala gUDinappude AyAlu garagu nAka lAsi vunnappuDu taDabATulEkAvA |
bEsabelli valapula pirivIkai rAbOluvEnanE beTTagAnu sigguvaDi vuNDunA ||

ca|| sarasa mADi nappuDe cavulellA buTTugAka gorabaina yappuDu koratalE kAvA |
yiravai SrIvE~mkaTESuDintalOne nannu gUDe varusa nindAkA niTuvale jokkakuNDunA ||


అక్కలాల చూడుడందరును - akkalAla cUDuDaMdarunu

అక్కలాల చూడుడందరును (రాగం: ) (తాళం : )
ప|| అక్కలాల చూడుడందరును | నిక్కివారవట్టీ నేడు గృష్ణుడు ||

చ|| ఆనవాలవుట్టి అడకులవుట్టి | పానకపుటుట్టి బలిమినే |
ఆనుక కోలలనందియంది కొట్టి | తేనెవుట్టి గొట్టి దేవకిసుతుడు ||

చ|| పెరుగువుట్టి మంచిపేరిన నేతివుట్టి | సరివెన్నవుట్టి చక్కెరవుట్టి |
వెరవుతో గొట్టి వెసబాలులతో | బొరుగువుట్టి గొట్టీపొంచి రాముడు ||

చ|| మక్కువ నలమేలుమంగగూడి నేడు | చొక్కి శ్రీవేంకటేశుడు వీధుల |
నిక్కి వుట్లెల్లా నిండా గొట్టివుట్టి | చక్కిలాలు గొట్టీ జగతీశుడు ||

akkalAla cUDuDaMdarunu (Raagam: ) (Taalam: )
pa|| akkalAla cUDuDaMdarunu | nikkivAravaTTI nEDu gRuShNuDu ||

ca|| AnavAlavuTTi aDakulavuTTi | pAnakapuTuTTi baliminE |
Anuka kOlalanaMdiyaMdi koTTi | tEnevuTTi goTTi dEvakisutuDu ||

ca|| peruguvuTTi maMcipErina nEtivuTTi | sarivennavuTTi cakkeravuTTi |
veravutO goTTi vesabAlulatO | boruguvuTTi goTTIpoMci rAmuDu ||

ca|| makkuva nalamElumaMgagUDi nEDu | cokki SrIvEMkaTESuDu vIdhula |
nikki vuTlellA niMDA goTTivuTTi | cakkilAlu goTTI jagatISuDu ||


అక్కరకొదగనియట్టి - akkarakodaganiyaTTi

అక్కరకొదగనియట్టియర్థము (రాగం: ) (తాళం : )
ప|| అక్కరకొదగనియట్టియర్థము | లెక్క లెన్నియైనా నేమి లేకున్న నేమిరే ||

చ|| దండితో దనకుగానిధరణీశురాజ్యంబు | యెండెనేమి యది పండెనేమిరే |
బెండుపడ గేశవుని బేరుకొననినాలికె | వుండెనేమి వుండకుండెనేమిరే ||

చ|| యెదిరి దన్ను గాననియెడపులగుడ్డికన్ను | మొదల దెఱచెనేమి మూసెనేమిరే |
వెదకి శ్రీపతిసేవ వేడుక జేయనివాడు | చదివెనేమి చదువు చాలించెనేమిరే ||

చ|| ఆవల నెవ్వరులేని అడవిలోనివెన్నెల | కావిరి గాసెనేమి కాయకున్ననేమిరే |
శ్రీవేంకటేశ్వరు జేరనిధర్మములెల్ల | తోవల నుండెనేమి తొలగిననేమిరే ||

akkarakodaganiyaTTiyarthamu (Raagam: ) (Taalam: )
pa|| akkarakodaganiyaTTiyarthamu | lekka lenniyainA nEmi lEkunna nEmirE ||

ca|| daMDitO danakugAnidharaNISurAjyaMbu | yeMDenEmi yadi paMDenEmirE |
beMDupaDa gESavuni bErukonaninAlike | vuMDenEmi vuMDakuMDenEmirE ||

ca|| yediri dannu gAnaniyeDapulaguDDikannu | modala derxacenEmi mUsenEmirE |
vedaki SrIpatisEva vEDuka jEyanivADu | cadivenEmi caduvu cAliMcenEmirE ||

ca|| Avala nevvarulEni aDavilOnivennela | kAviri gAsenEmi kAyakunnanEmirE |
SrIvEMkaTESvaru jEranidharmamulella | tOvala nuMDenEmi tolaginanEmirE ||

అక్కడ నాపాట్లువడి - akkaDa nApATluvaDi

అక్కడ నాపాట్లువడి (రాగం: ) (తాళం : )
ప|| అక్కడ నాపాట్లువడి యిక్కడ నీపాటు పడి | కుక్కనోరికళాసమై కొల్లబోయ బతుకు ||

చ|| ఎండచేత నీడచేత నెల్లవాడు నిట్లానే | బండుబండై యెందు గడపల గానక |
వుండగిలి నరకాల నుడుకబోయెద మింక | వండదరిగిన కూరవలెనాయ బతుకు ||

చ|| పంచమహాపాతకాలబారి బడి భవముల | దెంచి తెంచి ముడివేయ దీదీపులై |
పొంచినయాసలవెంట బొరలబోయెద మింక | దంచనున్న రోలిపిండితలపాయ బతుకు ||

చ|| యీదచేత వానచేత నెల్లనాడు బాయని | బాదచేత మేలెల్ల బట్టబయలై |
గాదిలి వేంకటపతి గానగబోయెద మింక | బీదగరచినబూరె ప్రియమాయ బ్రదుకు ||

akkaDa nApATluvaDi (Raagam: ) (Taalam: )
pa|| akkaDa nApATluvaDi yikkaDa nIpATu paDi | kukkanOrikaLAsamai kollabOya batuku ||

ca|| eMDacEta nIDacEta nellavADu niTlAnE | baMDubaMDai yeMdu gaDapala gAnaka |
vuMDagili narakAla nuDukabOyeda miMka | vaMDadarigina kUravalenAya batuku ||

ca|| paMcamahApAtakAlabAri baDi Bavamula | deMci teMci muDivEya dIdIpulai | poMcinayAsalaveMTa boralabOyeda miMka | daMcanunna rOlipiMDitalapAya batuku ||

ca|| yIdacEta vAnacEta nellanADu bAyani | bAdacEta mElella baTTabayalai |
gAdili vEMkaTapati gAnagabOyeda miMka | bIdagaracinabUre priyamAya braduku ||

అక్కటా రావణు బ్రహ్మ - akkaTaa rAvaNu brahma

అక్కటా రావణు బ్రహ్మ (రాగం: ) (తాళం : )
అక్కటా రావణు బ్రహ్మ హత్య నీకు నేడది పుక్కిట పురాణ లింగ పూజ నీకు నేడది
గురు హత్య బ్రహ్మ హత్యన్ గూడి ద్రోణాచార్యు వంక హరి నీ క్రుప నర్జునుకవి లేవాయ యెరవుగా గల్లలాడి యేచిన ధర్మ రాజునకు పరగ నీ యనుమతిన్ పాపము లేదాయను
అదివో రుద్రుని బ్రహ్మ హత్య బాయన్ గాసి ఇచ్చి పొదలిన నీవతని బూజింతువా అదనన్ పార్వతీదేవి కాతండే నీ మంత్రమిచ్చె వదరు మాటల మాయా వచనాలేమిటికి
తగిలిన నీ నామమే తారక బ్రహ్మమై జగము వారి పాపాలు సంతతమూ బాపన్ గాను మిగుల శ్రీ వేంకటేశ నేడ మీకు పాతకాలు నగున్ బాటు లింతే కాక నానా దేశముల

akkaTaa rAvaNu brahma (Raagam: ) (Taalam: )
akkaTaa rAvaNu brahma hatya nIku nEDadi pukkiTa purANa linga pUja nIku nEDadi
guru hatya brahma hatyan gUDi drONAchAryu vamka hari nI krupa narjunukavi lEvAya yeravugaa gallalADi yEchina dharma raajunaku paraga nI yanumatin pApamu lEdAyanu
adivO rudruni brahma hatya bAyan gaasi ichchi podalina nIvatani boojintuvA adanan pArvatIdEvi kAtanDE nI mantramichche vadaru mATala mAyA vachanAlEmiTiki
tagilina nI nAmamE tAraka brahmamai jagamu vaari paapaalu santatamoo baapan gaanu migula SrI vEnkaTESa nEDa mIku paatakaalu nagun baaTu lintE kaaka naanaa dESamula

అందులోనె వున్నావాడు - aMdulOne vunnAvADu

అందులోనె వున్నావాడు (రాగమ్: ) (తాలమ్: )
ప|| అందులోనె వున్నావాడు ఆది మూరితి | అందరాని పదవియైన నందిచ్చు నతడు ||

చ|| ఘనులిండ్ల వాకిళ్ళు కావ బొయ్యే జీవుడా | కని ణీ యాత్మ వాకిలి కావరాదా |
యెనసి పరుల రాజ్య మేలబొయ్యే జీవుడా | అనిశము నీ మనో రాజ్యము నేలరాదా ||

చ|| చెలుల రూపము లెల్ల చింతించే జీవుడా | చెలగి నీ రూప మేదో చింతించ రాదా |
కెలన సుఖములు భోగించేటి జీవుడా | పొలసి సుజ్ఞానము భోగించరాదా ||

చ|| చేవ సంసారాన బలిసిన యట్టి జీవుడా | భావపు టానందాన బలియ రాదా |
కోవరపు సంపదల కోరేటి జీవుడా | శ్రీ వేంకటేశుని సేవగోర రాదా ||

aMdulOne vunnAvADu (Raagam: ) (Taalam: )
pa|| aMdulOne vunnAvADu Adi mUriti | aMdarAni padaviyaina naMdiccu nataDu ||

ca|| GanuliMDla vAkiLLu kAva boyyE jIvuDA | kani NI yAtma vAkili kAvarAdA |
yenasi parula rAjya mElaboyyE jIvuDA | aniSamu nI manO rAjyamu nElarAdA ||

ca|| celula rUpamu lella ciMtiMcE jIvuDA | celagi nI rUpa mEdO ciMtiMca rAdA |
kelana suKamulu BOgiMcETi jIvuDA | polasi suj~jAnamu BOgiMcarAdA ||

ca|| cEva saMsArAna balisina yaTTi jIvuDA | BAvapu TAnaMdAna baliya rAdA |
kOvarapu saMpadala kOrETi jIvuDA | SrI vEMkaTESuni sEvagOra rAdA ||

అందాకా నమ్మలేక - Andaakaa nammaleka

అందాకా నమ్మలేక (రాగమ్: ) (తాలమ్: )
అందాకా నమ్మలేక అనుమానపడు దేహి అంది నీసొమ్ముగనక అదియు దీరుతువు
నీదాసుడననేటినిజబుద్ది గలిగితే అదెస నప్పుడే పుణ్యుడాయ నతడు వేదతొ వొక్కొక్క వేళ వెలుతులు గలిగితే నిదయవెట్టి వెనక నీవే తీరుతువు
తొలుత నీశరణము దొరకుటొకటేకాని చెలగి యాజీవునికి జేటు లేదు కలగి నడుమంత్రాన గతిదప్పనడచిన నెలకొని వంకలొత్తనీవే నేరుతువు
నీ వల్ల గొరత లేదు నీపేరు నొడిగితే శ్రీవేంకటేశ యిట్టె చేరి కాతువు భావించలేకుండగాను భారము నీదంటే జాలు నీవారి రక్షించ నీవె దిక్కౌదువు

Andaakaa nammaleka (Raagam: ) (Taalam: )
Andaakaa nammaleka anumaanapadu dehi Andi neesommuganaka adiyu deerutuvu
Needaasudananetinijabuddi galigite Adesa nappude punyudaaya natadu Vedato vokkokka vela velutulu galigite Nidayavetti venaka neeve teerutuvu
Toluta neesaranamu dorakutokatekaani Chelagi yaajeevuniki jetu ledu Kalagi nadumantraana gatidappanadachina Nelakoni vamkalottaneeve nerutuvu
Nee valla gorata ledu neeperu nodigite Sreevenkatesa yitte cheri kaatuvu Bhaavinchalekundagaanu bhaaramu needamte jaalu Neevaari rakshimcha neeve dikkauduvu

అందాకదాదానే - aMdAkadAdAnE

అందాకదాదానే అంతుకెక్కుడు (రాగమ్: ) (తాలమ్: )
ప|| అందాకదాదానే అంతుకెక్కుడు గాదు | ముందువెనుకంచేనా ముఖ్యుడే యతడు ||

చ|| చిత్తమంతర్ముఖము సేసుకొన నేర్చెనా | అత్తలనతడు యోగియనబడును |
సత్తసత్తనెడి సువిచారంబు గలిగెనా | వుత్తమ వివేకియని వూహింపబడును ||

చ|| భావము నబావమును పరికించి తెలిసెనా | కైవల్యనిలయుడని కానబడును | దైవముదన్నుమతిదలపోయెనేర్చెనా | జీవన్ముక్తుడని చెప్పబడునతడు ||

చ|| అడరి వైరాగ్యధనమార్జించనోపెనా | దిడువై జితేంద్రియ స్థిరుడాతడు |
జడియు శ్రీవేంకటేశ్వరుదాసుడాయనా | బడిబడిదుదబర బ్రహ్మమేయతడు ||

aMdAkadAdAnE aMtukekkuDu (Raagam: ) (Taalam: )
pa|| aMdAkadAdAnE aMtukekkuDu gAdu | muMduvenukaMcEnA muKyuDE yataDu ||

ca|| cittamaMtarmuKamu sEsukona nErcenA | attalanataDu yOgiyanabaDunu |
sattasattaneDi suvicAraMbu galigenA | vuttama vivEkiyani vUhiMpabaDunu ||

ca|| BAvamu nabAvamunu parikiMci telisenA | kaivalyanilayuDani kAnabaDunu | daivamudannumatidalapOyenErcenA | jIvanmuktuDani ceppabaDunataDu ||

ca|| aDari vairAgyadhanamArjiMcanOpenA | diDuvai jitEMdriya sthiruDAtaDu |
jaDiyu SrIvEMkaTESvarudAsuDAyanA | baDibaDidudabara brahmamEyataDu ||

అందరుమాలినయట్టి - aMdarumAlinayaTTi

అందరుమాలినయట్టిఅధములాల (రాగమ్: ) (తాలమ్: )
ప|| అందరుమాలినయట్టిఅధములాల | పొంత సంతకూటమి పొరిచూపు గాదా ||

చ|| కనక మిత్తడితోడ కలయ సరిచూచితే | అనువవునా అది దోష మవుగాక |
ఘనుడైనహరితో గడుహీనదేవతల | ననిచి సరివెట్టితే నయ మవునా భువిని ||

చ|| పట్టభద్రుడు గూర్చుండేబలుసింహాసనముపై | వెట్టిబంటు బెట్టేవారు వెఱ్ఱిలేకారా |
గట్టిగా శ్రీహరితోడ కలగంపదేవతల | బెట్టి కొలుచుట విందువెట్టి పగగాదా ||

చ|| కొంచక సింహముండేటిగుహ నుండవచ్చునా | పొంచి నక్కలకెల్ల బొక్కలెకాక |
అంచెల శ్రీవేంకటేశు డాత్మలోనే వుండగాను | కొంచపుదైవాల పలువంచలనేకాక ||

aMdarumAlinayaTTiadhamulAla(Raagam: ) (Taalam: )
pa|| aMdarumAlinayaTTiadhamulAla | poMta saMtakUTami poricUpu gAdA ||

ca|| kanaka mittaDitODa kalaya saricUcitE | anuvavunA adi dOSha mavugAka |
GanuDainaharitO gaDuhInadEvatala | nanici sariveTTitE naya mavunA Buvini ||

ca|| paTTaBadruDu gUrcuMDEbalusiMhAsanamupai | veTTibaMTu beTTEvAru verxrxilEkArA | gaTTigA SrIharitODa kalagaMpadEvatala | beTTi kolucuTa viMduveTTi pagagAdA ||

ca|| koMcaka siMhamuMDETiguha nuMDavaccunA | poMci nakkalakella bokkalekAka |
aMcela SrIvEMkaTESu DAtmalOnE vuMDagAnu | koMcapudaivAla paluvaMcalanEkAka ||

అందరివలెనే వున్నాడాతడా - aMdarivalenE vunnADAtaDA

అందరివలెనే వున్నాడాతడా (రాగమ్: ) (తాలమ్: )
ప|| అందరివలెనే వున్నాడాతడా వీడు | యిందుముఖుల గూడినా డీతడా నాడు ||

చ|| యిందరూ నేటేట జేసేయింద్రయాగపు ముద్దలు | అందుకొని యారగించినాతడా వీడు |
చెంది మునులసతులసత దెప్పించుక మంచి | విందులారగించినాడు వీడానాడు ||

చ|| తొలుత బ్రహ్మదాచిన దూడలకు బాలులకు | అలరి మారుగడించినాతడా వీడు |
నిలుచుండేడుదినాలు నెమ్మది వేలగొండెత్తి | యిల నావుల గాచినా డీతడా నాడు ||

చ|| బాలుడై పూతనాదుల బలురక్కసుల జంపి | అలరియాటలాడిన యాతడా వీడు |
యీలీల శ్రీవేంకటాద్రి యెక్కినాడు తొలుతే | యేలెను బ్రహ్మాదుల నీతడానాడు ||

aMdarivalenE vunnADAtaDA (Raagam: ) (Taalam: )
pa|| aMdarivalenE vunnADAtaDA vIDu | yiMdumuKula gUDinA DItaDA nADu ||

ca|| yiMdarU nETETa jEsEyiMdrayAgapu muddalu | aMdukoni yAragiMcinAtaDA vIDu |
 ceMdi munulasatulasata deppiMcuka maMci | viMdulAragiMcinADu vIDAnADu ||

ca|| toluta brahmadAcina dUDalaku bAlulaku | alari mArugaDiMcinAtaDA vIDu |
nilucuMDEDudinAlu nemmadi vElagoMDetti | yila nAvula gAcinA DItaDA nADu ||

ca|| bAluDai pUtanAdula balurakkasula jaMpi | alariyATalADina yAtaDA vIDu |
yIlIla SrIvEMkaTAdri yekkinADu tolutE | yElenu brahmAdula nItaDAnADu ||


అందరికి సులభుడై - aMdariki sulabhuDai

అందరికి సులభుడై (రాగం: ) (తాళం : )
అందరికి సులభుడై అంతరాత్మ యున్నవాడు
యిందునే శేషగిరిని యిరవై విష్ణుడు

యోగీశ్వరుల మతినుండేటి దేవుడు క్షీర -
సాగరశాయియైన సర్వేశుడు
భాగవతాధీనుడైన పరమపురుషుడు
ఆగమోక్తవిధులందు నలరిననిత్యుడు

వైకుంఠమందునున్న వనజనాభుడు పర-
మాకారమందునున్న ఆదిమూరితి
ఆకడసూర్యకోట్లందునున్న పరంజ్యోతి
దాకొన బ్రహ్మాండాలు ధరించిన బ్రహ్మము

నిండువిస్వరూపమై నిలిచినమాధవుడు
దండివేదంతములు వెదకే ధనము
పండిన కర్మఫలము పాలికివచ్చినరాసి
అండనే శ్రీవేంకటేశుడైన లోకబంధుడు

aMdariki sulabhuDai (Raagam: ) (Taalam: )
aMdariki sulabhuDai aMtarAtma yunnavADu
yiMdunE SEshagirini yiravai vishNuDu

yOgISwarula matinuMDETi dEvuDu kshIra -
sAgaraSAyiyaina sarwESuDu
bhAgavatAdhInuDaina paramapurushuDu
AgamOktavidhulaMdu nalarinanityuDu

vaikuMThamaMdununna vanajanAbhuDu para-
mAkAramaMdununna AdimUriti
AkaDasUryakOTlaMdununna paraMjyOti
dAkona brahmAMDAlu dhariMchina brahmamu

niMDuviswarUpamai nilichinamAdhavuDu
daMDivEdaMtamulu vedakE dhanamu
paMDina karmaphalamu pAlikivachchinarAsi
aMDanE SrIvEMkaTESuDaina lOkabaMdhuDu

అందరికి నెక్కుడైన - aMdariki nekkuDaina

అందరికి నెక్కుడైన (రాగం: ) (తాళం : )
అందరికి నెక్కుడైన హనుమంతుడు
అందుకొనె సూర్యఫలమని హనుమంతుడు

బల్లిదుడై లంకజొచ్చి బలురాకాసుల గొట్టి
హల్లకల్లోలము చేసె హనుమంతుడు
వొల్లనె రాముల ముద్దుటుంగరము సీత కిచ్చె
అల్లదె నిలుచున్నాడు హనుమంతుడు

దాకొని యాకెముందర తనగుఱు తెరుగించి
ఆకారమటు చూపె హనుమంతుడు
చేకొని శిరోమణి చేతబట్టి జలనిధి
ఆకసాన దాటివచ్చె హనుమంతుడు

కొంకకిట్టె సంజీవి కొండ దెచ్చి రిపులకు
నంకకాడై నిలిచెను హనుమంతుడు
తెంకినే శ్రీవెంకటాద్రి దేవుని మెప్పించినాడు
అంకె కలశాపురపు హనుమంతుడు

aMdariki nekkuDaina (Raagam: ) (Taalam: )
aMdariki nekkuDaina hanumaMtuDu
aMdukone sUryaphalamani hanumaMtuDu

balliduDai laMkajochchi balurAkAsula goTTi
hallakallOlamu chEse hanumaMtuDu
vollane rAmula mudduTuMgaramu sIta kichche
allade niluchunnADu hanumaMtuDu

dAkoni yAkemuMdara tanagu~ru terugiMchi
AkAramaTu chUpe hanumaMtuDu
chEkoni SirOmaNi chEtabaTTi jalanidhi
AkasAna dATivachche hanumaMtuDU

koMkakiTTe saMjIvi koMDa dechchi ripulaku
naMkakADai nilichenu hanumaMtuDu
teMkinE SrIveMkaTAdri dEvuni meppiMchinADu
aMke kalaSApurapu hanumaMtuDu

అందరికాధారమైన - aMdarikAdhAramaina

అందరికాధారమైన ఆది (రాగమ్: ) (తాలమ్: )
ప|| అందరికాధారమైన ఆది పురుషుడీతడు | విందై మున్నారగించె విదురునికడ నీతుడు ||

చ|| సనకాదులు కొనియాడెడి సర్వాత్మకుడీతడు | వనజ భవాదులకును దైవంబై నతడీతడు | ఇనమండలమున జెలగేటిహితవై భవుడితడు | మునుపుట్టిన దేవతలకు మూలభూతి యీతడు ||

చ|| సిరులొసగి యశోదయింట శిశువైనత డీతడు | ధరనావుల మందలలో తగ జరించె నీతడు |
సరసతలను గొల్లెతలకు జనవులొసగె నీతడు | ఆరసి కుచేలుని యడుకులు ఆరగించెనీతడు ||

చ|| పంకజభవునకును బ్రహ్మ పద మొసగెను యీతుడు | సంకీర్తన లాద్యులచే జట్టి గొనియెనీతడు |
తెంకిగ నేకాలము పరదేవుడైన యీతడు | వేంకటగిరి మీద ప్రభల వెలసిన ఘనుడీతడు ||

aMdarikAdhAramaina Adi (Raagam: ) (Taalam: )
pa|| aMdarikAdhAramaina Adi puruShuDItaDu | viMdai munnAragiMce vidurunikaDa nItuDu ||

ca|| sanakAdulu koniyADeDi sarvAtmakuDItaDu | vanaja BavAdulakunu daivaMbai nataDItaDu | inamaMDalamuna jelagETihitavai BavuDitaDu | munupuTTina dEvatalaku mUlaBUti yItaDu ||

ca|| sirulosagi yaSOdayiMTa SiSuvainata DItaDu | dharanAvula maMdalalO taga jariMce nItaDu | sarasatalanu golletalaku janavulosage nItaDu | Arasi kucEluni yaDukulu AragiMcenItaDu ||

ca|| paMkajaBavunakunu brahma pada mosagenu yItuDu | saMkIrtana lAdyulacE jaTTi goniyenItaDu | teMkiga nEkAlamu paradEvuDaina yItaDu | vEMkaTagiri mIda praBala velasina GanuDItaDu ||

అందరి బ్రదుకులు - aMdari bradukulu

అందరి బ్రదుకులు నాతనివే (రాగమ్: ) (తాలమ్: )
ప|| అందరి బ్రదుకులు నాతనివే | కందువెల్ల శ్రీకాంతునిదే ||

చ|| వేమరు జదివెడి విప్రుల వేదము | సోమకవైరి యశో విభవం |
శ్రీమించు నమరుల జీవనమెల్ల సు- | ధామ ధనుని సంతత కరుణే ||

చ|| హితవగు నిలలో నీసుఖమెల్లను | దితి సుత దమనుడు దెచ్చినదే |
తతి తల్లి దండ్రి తానై కాచిన | రతి ప్రహ్లాద వరదుని కృపే ||

చ|| అలరిన యమరేంద్రాదుల బ్రదుకులు | బలి బంధను కృప బరగినవే ||
బలసి మునుల యాపదలు వాపుటకు | బలునృప భంజను పరిణతలే ||

చ|| పూని యనాథుల పొందుగ గాచిన | జానకీ విభుని సరసతలే |
నానా భూభరణంబులు నందుని | సూనుడు చేసిన సుకృతములే ||

చ|| తలకొని ధర్మము తానై నిలుపుట | కలుష విదూరుని గర్వములే |
నిలిచి లోకములు నిలిపిన ఘనుడగు | కలియుగమున వేంకటపతివే ||

aMdari bradukulu nAtanivE (Raagam: ) (Taalam: )
pa|| aMdari bradukulu nAtanivE | kaMduvella SrIkAMtunidE ||

ca|| vEmaru jadiveDi viprula vEdamu | sOmakavairi yaSO viBavaM |
SrImiMcu namarula jIvanamella su- | dhAma dhanuni saMtata karuNE ||

ca|| hitavagu nilalO nIsuKamellanu | diti suta damanuDu deccinadE |
tati talli daMDri tAnai kAcina | rati prahlAda varaduni kRupE ||

ca|| alarina yamarEMdrAdula bradukulu | bali baMdhanu kRupa baraginavE ||
balasi munula yApadalu vApuTaku | balunRupa BaMjanu pariNatalE ||

ca|| pUni yanAthula poMduga gAcina | jAnakI viBuni sarasatalE |
nAnA BUBaraNaMbulu naMduni | sUnuDu cEsina sukRutamulE ||

ca|| talakoni dharmamu tAnai nilupuTa | kaluSha vidUruni garvamulE |
nilici lOkamulu nilipina GanuDagu | kaliyugamuna vEMkaTapativE ||

అంతర్యామి అలసితి - aMtaryAmi alasiti

అంతర్యామి అలసితి (రాగమ్: ) (తాలమ్: )
ప|| అంతర్యామి అలసితి సొలసితి | ఇంతట నీ శరణిదె జొచ్చితిని ||

చ|| కోరిన కోర్కులు కోయని కట్లు | తీరవు నీవవి తెంచక |
భారపు బగ్గాలు పాప పుణ్యములు | నేరుపుల బోనీవు నీవు వద్దనక ||

చ|| జనుల సంగముల జక్క రోగములు | విను విడువవు నీవు విడిపించక |
వినయపు దైన్యము విడువని కర్మము | చనదది నీవిటు శాంతపరచక ||

చ|| మదిలో చింతలు మైలలు మణుగులు | వదలవు నీవవి వద్దనక |
ఎదుటనె శ్రీ వెంకటేశ్వర నీవదె | అదన గాచితివి అట్టిట్టనక ||

aMtaryAmi alasiti (Raagam: ) (Taalam: )
pa|| aMtaryAmi alasiti solasiti | iMtaTa nI SaraNide joccitini ||

ca|| kOrina kOrkulu kOyani kaTlu | tIravu nIvavi teMcaka |
BArapu baggAlu pApa puNyamulu | nErupula bOnIvu nIvu vaddanaka ||

ca|| janula saMgamula jakka rOgamulu | vinu viDuvavu nIvu viDipiMcaka |
vinayapu dainyamu viDuvani karmamu | canadadi nIviTu SAMtaparacaka ||

ca|| madilO ciMtalu mailalu maNugulu | vadalavu nIvavi vaddanaka |
eduTane SrI veMkaTESvara nIvade | adana gAcitivi aTTiTTanaka ||


అంతరుమాలినయట్టి - aMtarumAlinayaTTi

అంతరుమాలినయట్టి  (రాగమ్: ) (తాలమ్: )
ప|| అంతరుమాలినయట్టి అధములాల | పొంత సంతకూటమి పొరిచూపు గాదా ||

చ|| కనక మిత్తడితోడ కలయ సరిదూచితే | అనువవునా అది దోష మవుగాక |
ఘనుడైనహరితో గడుహీనదేవతల | ననిచి సరివేట్టితే నయ మవునా భువిని ||

చ|| పట్టభద్రుడు గూర్చుండేబలుసింహాసనముపై | వెట్టిబంటు బెట్టేవారు వెఱ్ఱులేకారా |
గట్టిగా శ్రీహరితోడ కలగంపదేవతల | బెట్టి కొలుచుట విందువెట్టి పగగాదా ||

చ|| కొంచక సింహముండేటిగుహ నుండవచ్చునా | పొంచి నక్కలకెల్ల బొక్కలేకాక |
 అంచెల శ్రీవేంకటేశు డాత్మలోనే వుండగాను | కొంచెపుదైవాల పలువంచలనేకాక ||

aMtarumAlinayaTTi (Raagam: ) (Taalam: )
pa|| aMtarumAlinayaTTi adhamulAla | poMta saMtakUTami poricUpu gAdA ||

ca|| kanaka mittaDitODa kalaya saridUcitE | anuvavunA adi dOSha mavugAka |
GanuDainaharitO gaDuhInadEvatala | nanici sarivETTitE naya mavunA Buvini ||

ca|| paTTaBadruDu gUrcuMDEbalusiMhAsanamupai | veTTibaMTu beTTEvAru verxrxulEkArA | gaTTigA SrIharitODa kalagaMpadEvatala | beTTi kolucuTa viMduveTTi pagagAdA ||

ca|| koMcaka siMhamuMDETiguha nuMDavaccunA | poMci nakkalakella bokkalEkAka |
aMcela SrIvEMkaTESu DAtmalOnE vuMDagAnu | koMcepudaivAla paluvaMcalanEkAka ||


అంతరంగమెల్ల - aMtaraMgamella

అంతరంగమెల్ల శ్రీహరికి (రాగమ్: ) (తాలమ్: )
ప|| అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించుకుంటె | వింతవింత విధముల వీడునా బంధములు ||

చ|| మనుజుడై ఫలమేది మరిజ్ఞాని యౌదాకా | తనువెత్తి ఫలమేది దయగలుగుదాకా |
ధనికుడై ఫలమేది ధర్మము సేయుదాకా | పనిమాలి ముదిసితే పాసెనా భవము ||

చ|| చదివియు ఫలమేది శాంతము కలుగుదాకా | పెదవెత్తి ఫలమేది ప్రియమాడు దాకా |
మదిగల్గి ఫలమేది మాధవుదలచు దాకా | ఎదుట తాను రాజైతే ఏలెనాపరము ||

చ|| పావనుడై ఫలమేది భక్తి కలిగినదాకా | జీవించి ఫలమేది చింత దీరుదాకా |
వేవేల ఫలమేది వేంకటేశు గన్నదాకా | భావించితా దేవుడైతే ప్రత్యక్షమౌనా ||

aMtaraMgamella SrIhariki (Raagam: ) (Taalam: )
pa|| aMtaraMgamella SrIhariki oppiMcukuMTe | viMtaviMta vidhamula vIDunA baMdhamulu ||

ca|| manujuDai PalamEdi marij~jAni yaudAkA | tanuvetti PalamEdi dayagalugudAkA |
dhanikuDai PalamEdi dharmamu sEyudAkA | panimAli mudisitE pAsenA Bavamu ||

ca|| cadiviyu PalamEdi SAMtamu kalugudAkA | pedavetti PalamEdi priyamADu dAkA |
madigalgi PalamEdi mAdhavudalacu dAkA | eduTa tAnu rAjaitE ElenAparamu ||

ca|| pAvanuDai PalamEdi Bakti kaliginadAkA | jIviMci PalamEdi ciMta dIrudAkA |
vEvEla PalamEdi vEMkaTESu gannadAkA | BAviMcitA dEvuDaitE pratyakShamaunA ||


అంతయు నీవే హరి - aMtayu nIvE hari

అంతయు నీవే హరి (రాగమ్: ) (తాలమ్: )
ప|| అంతయు నీవే హరి పుండరీకాక్ష | చెంత నాకు నీవే శ్రీరఘురామ ||

చ|| కులమును నీవే గోవిందుడా నా | కలిమియు నీవే కరుణానిధి |
తలపును నీవే ధరణీధర నా | నెలవును నీవే నీరజనాభ ||

చ|| తనువును నీవే దామోదర నా | మనికియు నీవే మధుసూదన |
వినికియు నీవే విట్ఠలుడా నా | వెనకముందు నీవే విష్ణు దేవుడా ||

చ|| పుట్టుగు నీవే పురుషోత్తమ | కొన నట్టనడుము నీవే నారాయణ |
ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు | నెట్టన గతి ఇంక నీవే నీవే ||

aMtayu nIvE hari (Raagam: ) (Taalam: )
pa|| aMtayu nIvE hari puMDarIkAkSha | ceMta nAku nIvE SrIraGurAma ||

ca|| kulamunu nIvE gOviMduDA nA | kalimiyu nIvE karuNAnidhi |
talapunu nIvE dharaNIdhara nA | nelavunu nIvE nIrajanABa ||

ca|| tanuvunu nIvE dAmOdara nA | manikiyu nIvE madhusUdana |
vinikiyu nIvE viTThaluDA nA | venakamuMdu nIvE viShNu dEvuDA ||

ca|| puTTugu nIvE puruShOttama | kona naTTanaDumu nIvE nArAyaNa |
iTTE SrI veMkaTESvaruDA nAku | neTTana gati iMka nIvE nIvE ||

అంతటనె వచ్చికాచు - aMtaTane vachchikAchu

అంతటనె వచ్చికాచు (రాగం:కాంభోది ) (తాళం : )
అంతటనే వచ్చికాచు నాపద్భంధుడు హరి
వంతుకు వాసికి నతనివాడనంటేజాలు ||పల్లవి||
బంతిగట్టినురిపేటి పసురము లెడనెడ
బొంత నొక్కొక్క గవుక వుచ్చుకొన్నట్టు
చెంతల సంసారముసేయునరు డందులోనె
కొంతగొంత హరినాత్మ గొలుచుటే చాలు ||అంత||
వరుస జేదుదినేవాడు యెడ నెడ గొంత
సరవితోడుత దీపు చవిగొన్నట్టు
దురితవిధులు సేసి దుఃఖించుమానవుడు
తరువాత హరిపేరు దలచుటే చాలు ||అంత||
కడు బేదైనవాడు కాలకర్మవశమున
అడుగులోనే నిధాన మటు గన్నట్టు
యెడసి శ్రీవేంకటేశు నెరగక గురువాజ్ఞ
పొడగన్నవానిభక్తి పొడముటే చాలు ||అంత|||

aMtaTane vachchikAchu (Raagam: kaambhOdi ) (Taalam: )
 
aMtaTanE vachchikAchu nApadbhaMdhuDu hari
vaMtuku vAsiki natanivADanaMTEjAlu ||pallavi||
baMtigaTTinuripETi pasuramu leDaneDa
boMta nokkokka gavuka vuchchukonnaTTu
cheMtala saMsAramusEyunaru DaMdulOne
koMtagoMta harinAtma goluchuTE chAlu ||aMta||
varusa jEdudinEvaaDu yeDa neDa gonta
saravitODuta deepu chavigonnaTTu
duritavidhulu sEsi du@hkhinchumAnavuDu
taruvaata haripEru dalachuTE chaalu ||aMta||
kaDu bEdainavaaDu kaalakarmavaSamuna
aDugulOnE nidhaana maTu gannaTTu
yeDasi SreeVEnkaTESu neragaka guruvaaj~na
poDagannavaanibhakti poDamuTE chAlu ||aMta| (Book4/Keertana 201)

అంటబారి పట్టుకోరే - aMTabAri paTTukOrE

అంటబారి పట్టుకోరే (రాగమ్: ) (తాలమ్: )
ప|| అంటబారి పట్టుకోరే అమ్మలాల యిదె | వెంటబారనీదు నన్ను వెడమాయతురుము ||

చ|| కాగెడుపెరుగుచాడె కవ్వముతో బొడిచి | లేగల దోలుకొని అలిగిపోయీని |
రాగతనమున వాడె రాతిరి నారగించడు | ఆగి నన్ను గూడడిగె నయ్యో ఇందాకను ||

చ|| కొలదిగానిపెరుగు కొసరికొసరి పోరి | కలవూరుగాయలెల్ల గలచిపెట్టె |
పలుకడు చేతిచట్టి పారవేసి పోయీనదె | చెలగుచు మూటగట్టె జెల్లబో యిందాకను ||

చ|| మట్టుపడకిటు నూరుమారులైనా నారగించు | ఇట్టె యిందరిలోన నిన్నాళ్ళును |
వెట్టికి నాకొరకుగా వేంకటేశు డారగించె | యెట్టు నేడాకట ధరియించెనో యిందాకను ||


aMTabAri paTTukOrE (Raagam: ) (Taalam: )
pa|| aMTabAri paTTukOrE ammalAla yide | veMTabAranIdu nannu veDamAyaturumu ||

ca|| kAgeDuperugucADe kavvamutO boDici | lEgala dOlukoni aligipOyIni |
 rAgatanamuna vADe rAtiri nAragiMcaDu | Agi nannu gUDaDige nayyO iMdAkanu ||

ca|| koladigAniperugu kosarikosari pOri | kalavUrugAyalella galacipeTTe |
palukaDu cEticaTTi pAravEsi pOyInade | celagucu mUTagaTTe jellabO yiMdAkanu ||

ca|| maTTupaDakiTu nUrumArulainA nAragiMcu | iTTe yiMdarilOna ninnALLunu |
veTTiki nAkorakugA vEMkaTESu DAragiMce | yeTTu nEDAkaTa dhariyiMcenO yiMdAkanu ||

అంజనేయ అనిలజ - anjanEya anilaja

అంజనేయ అనిలజ (రాగం:) (తాళం : )
అంజనేయ అనిలజ హనుమంతా
శ్రీ ఆంజనేయ అనిలజ హనుమంతా
శ్రీ ఆంజనేయ అనిలజ హనుమంత
నీ రంజకపు చేతలు సురలకెంత వశమా
తేరిమీద నీ రూపు తెచ్చిపెత్తి ఆర్జునుడు
కౌరవుల గెలిచే సంగర భూమిని
సారెకు భీముడు పురుషామృగము తెచ్చు చోట
నీరోమములు కావా నిఖిల కారణము
నీ మూలమునగాదే నెలవై సుగ్రీవుడు
రాముని గొలిచి కపిరాజాయెను
రాముడు నీ వంకనేపో రమణి సీతా దేవి
ప్రేమముతో మగువ పెండ్లాడెను
బలుదైత్యులను దుంచ బంటు తనము మించ
కలకాలమునునెంచ కలిగితిగా
అల శ్రీవేంకటపతి అండనె మంగాంబుధి
నిలయపు హనుమంత నెగడితిగా


anjanEya anilaja (Raagam: ) (Taalam: )
anjanEya anilaja hanumantA
Sree aamjanaeya anilaja hanumamtaa
Sree aamjanaeya anilaja hanumamta
nee ramjakapu chaetalu suralakemta vaSamaa
taerimeeda nee roopu techchipetti aarjunuDu
kauravula gelichae samgara bhoomini
saareku bheemuDu purushaamRgamu techchu chOTa
neerOmamulu kaavaa nikhila kaaraNamu
nee moolamunagaadE nelavai sugreevuDu
raamuni golichi kapiraajaayenu
raamuDu nee vamkanaepO ramaNi seetaa daevi
praemamutO maguva pemDlaaDenu
baludaityulanu dumcha bamTu tanamu mimcha
kalakaalamununemcha kaligitigaa
ala SreevaemkaTapati amDane mamgaambudhi
nilayapu hanumamta negaDitigaa

అంచిత పుణ్యులకైతే - aMcita puNyulakaitE

అంచిత పుణ్యులకైతే (రాగమ్: ) (తాలమ్: )
ప|| అంచిత పుణ్యులకైతే హరి దైవమవుగాక | పంచమహాపాతకులభ్రమ వాపవశమా ||

చ|| కాననియజ్ఞానులకు కర్మమే దైవము | ఆనినబద్ధులకు దేహమే దైవము |
మాననికాముకులకు మగువలే దైవము | పానిపట్టి వారివారిభ్రమ మాన్పవశమా ||

చ|| యేమీ నెఱుగనివారి కింద్రియములు దైవము | దోమటిసంసారి కూరదొర దైవము |
తామసులకెల్లాను ధనమే దైవము | పామరుల బట్టినట్టిభ్రమ బాపవశమా ||

చ|| ధన నహంకరులకు తాదానే దైవము | దరిద్రుడైనవానికి దాత దైవము |
యిరవై మాకు శ్రీవేంకటేశుడే దైవము | పరులముంచినయట్టి భ్రమ బాపవశమా ||

aMcita puNyulakaitE (Raagam: ) (Taalam: )
pa|| aMcita puNyulakaitE hari daivamavugAka | paMcamahApAtakulaBrama vApavaSamA ||

ca|| kAnaniyaj~jAnulaku karmamE daivamu | Aninabaddhulaku dEhamE daivamu |
mAnanikAmukulaku maguvalE daivamu | pAnipaTTi vArivAriBrama mAnpavaSamA ||

ca|| yEmI nerxuganivAri kiMdriyamulu daivamu | dOmaTisaMsAri kUradora daivamu |
tAmasulakellAnu dhanamE daivamu | pAmarula baTTinaTTiBrama bApavaSamA ||

ca|| dhana nahaMkarulaku tAdAnE daivamu | daridruDainavAniki dAta daivamu |
yiravai mAku SrIvEMkaTESuDE daivamu | parulamuMcinayaTTi Brama bApavaSamA ||

అంగనలాల - aMganalAla

అంగనలాల మనచే (రాగమ్: ) (తాలమ్: )
ప|| అంగనలాల మనచే నాడించుకొనెగాని | సంగతెఱిగిననెరజాణ డితడే ||

చ|| వొడలులేనివాని కొక్కడే తండ్రాయగాని | తడయక పురుషోత్తము డితడే |
బడబాగ్నిజలధికి బాయకల్లుడాయగాని | వెడలించె నమృతము విష్ణుడితడే ||

చ|| పులిగూడుదిన్నవానిపొం దొక్కటే సేసెగాని | నలువంక లక్ష్మీనాథు డితడే |
చలికి గోవరివానివరుస బావాయగాని | పలుదేవతలకెల్ల ప్రాణబంధు డితడే ||

చ|| యెక్కడో గొల్లసతుల కింటిమగడాయగాని | తక్కకవెదకేపరతత్త్వ మితడే |
మిక్కిలి శ్రీవేంకటాద్రిమీద మమ్ము నేలెగాని | తక్కక వేదముచెప్పేదైవమీతడే ||


aMganalAla manacE (Raagam: ) (Taalam: )
pa|| aMganalAla manacE nADiMcukonegAni | saMgaterxiginanerajANa DitaDE ||

ca|| voDalulEnivAni kokkaDE taMDrAyagAni | taDayaka puruShOttamu DitaDE |
baDabAgnijaladhiki bAyakalluDAyagAni | veDaliMce namRutamu viShNuDitaDE ||

ca|| puligUDudinnavAnipoM dokkaTE sEsegAni | naluvaMka lakShmInAthu DitaDE |
caliki gOvarivAnivarusa bAvAyagAni | paludEvatalakella prANabaMdhu DitaDE ||

ca|| yekkaDO gollasatula kiMTimagaDAyagAni | takkakavedakEparatattva mitaDE |
mikkili SrIvEMkaTAdrimIda mammu nElegAni | takkaka vEdamuceppEdaivamItaDE ||


అంగన లీరె - aMganalIrE

అంగనలీరే హారతులు (రాగం: ) (తాళం : )
ప అంగనలీరే హారతులు అంగజగురునకు నారతులు

చ శ్రీదేవి తోడుత జెలగుచు నవ్వే ఆదిమ పురుషుని కారతులు
మేదినీ రమణి మేలము లాడేటి ఆదిత్య తేజున కారతులు

చ సురలకు నమౄతము సొరది నొసంగిన హరి కివో పసిడారతులు
తరమిది దుష్టుల దనుజుల నడచిన అరి భయంకరున కారతులు

చ నిచ్చలు కల్యాణ నిధియై యేగేటి అచ్యుతునకు నివె యారతులు
చొచ్చి శ్రీ వేంకటేశుడు నలమేల్మంగ యచ్చుగ నిలిచిరి యారతులు

aMganalIrE hAratulu (Raagam: ) (Taalam: )
pa aMganalIrE hAratulu
aMgajagurunaku nAratulu||

ca SrIdEvi tODuta jelagucu navvE Adima puruShuni kAratulu|
mEdinI ramaNi mElamu lADETi Aditya tEjuna kAratulu||

ca suralaku namRutamu soradi nosaMgina hari kivO pasiDAratulu|
taramidi duShTula danujula naDacina ari BayaMkaruna kAratulu||

ca niccalu kalyANa nidhiyai yEgETi acyutunaku nive yAratulu|
cocci SrI vEMkaTESuDu nalamElmaMga yaccuga niliciri yAratulu ||

అంగన యెట్టుండినా - aMgana yeTTuMDinA

అంగన యెట్టుండినా (రాగమ్: ) (తాలమ్: )
ప|| అంగన యెట్టుండినా నమరుగాక |
సంగతే నీకు నాపె సాటికి బెనగను ||

చ|| తనకు బోదైనచోట తగిలి మాటాడకున్న |
మనుజుడావాడు పెద్ద మాకు గాక |
చనవున బెనగగా సమ్మతించకుండితేను |
ఘనత యేది చులకదనమే గాక ||

చ|| చెల్లుబడి గలచోట సిగ్గులు విడువకున్న |
బల్లిదుడా వాడూ కడు పందగాక |
వెల్లివిరి నవ్వగాను వీడు దోళ్ళాడకున్న |
చల్లేటి వలపులేవి సటలింతే కాక ||

చ|| తారుకాణలైన చీట తమకించి కూడకున్న |
చేరగ జాణడా గోడచేరుపు గాక |
యీ రీతి శ్రీ వేంకటేశ యిట్టె రఘునాథుడవై |
కూరిమి గూడితివిది కొత్తలింతే కాక ||

aMgana yeTTuMDinA (Raagam: ) (Taalam: )

pa|| aMgana yeTTuMDinA namarugAka |
saMgatE nIku nApe sATiki benaganu ||

ca|| tanaku bOdainacOTa tagili mATADakunna |
manujuDAvADu pedda mAku gAka |
canavuna benagagA sammatiMcakuMDitEnu |
Ganata yEdi culakadanamE gAka ||

ca|| cellubaDi galacOTa siggulu viDuvakunna |
balliduDA vADU kaDu paMdagAka |
velliviri navvagAnu vIDu dOLLADakunna |
callETi valapulEvi saTaliMtE kAka ||

ca|| tArukANalaina cITa tamakiMci kUDakunna |
cEraga jANaDA gODacErupu gAka |
yI rIti SrI vEMkaTESa yiTTe raGunAthuDavai |
kUrimi gUDitividi kottaliMtE kAka ||

అంగన నిన్నడిగి - aMgana ninnaDigi

అంగన నిన్నడిగి (రాగమ్: ) (తాలమ్: )

ప|| అంగన నిన్నడిగి రమ్మనె నీమాట |
సంగతిగ మరుమాట సరి నాన తీవయ్యా ||

చ|| చెలులచే నింతి నీకు చెప్పిపంపిన మాటలు |
తలచుకొన్నాడవా దయతో నీవు |
తొలుత గాను కంపిన దొడ్డ పూవుల బంతి |
లలిమించిన పరిమళము గొంటివా ||

చ|| చాయల నాసతో నాపె సారె జూచిన చూపులు |
ఆయములు గరచేనా అంటుకొనెనా |
చేయెత్తి సిగ్గుతోడ చేరి మొక్కిన మొక్కులు |
ఆయనా నీకు శలవు అందరిలోనా ||

చ|| బెరసి తెరమాటున బెట్టిన నీపై సేసలు |
శిరసుపై నిండెనా చిందెనా నీపై |
అరుదై శ్రీ వేంకటేశ అలమేలుమంగ యీకె |
గరిమ నిన్ను గూడి గద్దెపై గూచున్నది ||


aMgana ninnaDigi (Raagam: ) (Taalam: )

pa|| aMgana ninnaDigi rammane nImATa |
saMgatiga marumATa sari nAna tIvayyA ||

ca|| celulacE niMti nIku ceppipaMpina mATalu |
talacukonnADavA dayatO nIvu |
toluta gAnu kaMpina doDDa pUvula baMti |
lalimiMcina parimaLamu goMTivA ||

ca|| cAyala nAsatO nApe sAre jUcina cUpulu |
Ayamulu garacEnA aMTukonenA |
cEyetti siggutODa cEri mokkina mokkulu |
AyanA nIku Salavu aMdarilOnA ||

ca|| berasi teramATuna beTTina nIpai sEsalu |
Sirasupai niMDenA ciMdenA nIpai |
arudai SrI vEMkaTESa alamElumaMga yIke |
garima ninnu gUDi gaddepai gUcunnadi ||

అంగడి నెవ్వరు - aMgaDi nevvaru

అంగడి నెవ్వరు నంటకురో (రాగమ్: ) (తాలమ్: )
ప|| అంగడి నెవ్వరు నంటకురో యీ- |
దొంగలగూడిన ద్రోహులను ||

చ|| దోసము దోసము తొలరో శ్రీహరి- |
దాసానదాసుల దగ్గరక ఆసలనాసల హరినెరుగక చెడి |
వీసరపోయిన వెర్రులము ||

చ|| పాపము పాపము పాయరో కర్మపు- |
దాపవువారము దగ్గరక |
చేపట్టి వేదపు శ్రీహరి కథలు |
యేపొద్దు విననిహీనులము ||

చ|| పంకము పంకము పైకొనిరాకురో |
కొంకుగొసరులకూళలము |
వేంకటగిరిపై విభునిపుణ్యకథ |
లంకెల విననియన్యులము ||

aMgaDi nevvaru naMTakurO (Raagam: ) (Taalam: )

pa|| aMgaDi nevvaru naMTakurO yI- |
doMgalagUDina drOhulanu ||

ca|| dOsamu dOsamu tolarO SrIhari- |
dAsAnadAsula daggaraka AsalanAsala harinerugaka ceDi |
vIsarapOyina verrulamu ||

ca|| pApamu pApamu pAyarO karmapu- |
dApavuvAramu daggaraka |
cEpaTTi vEdapu SrIhari kathalu |
yEpoddu vinanihInulamu ||

ca|| paMkamu paMkamu paikonirAkurO |
koMkugosarulakULalamu |
vEMkaTagiripai viBunipuNyakatha |
laMkela vinaniyanyulamu ||

ha - హ page 73

  • హరి కృష్ణ మేలుకొను ఆదిపురుషా
  • హరి గొలిచియు మరీ
  • హరి గోవిందా హరి గోవిందా
  • హరిదాసుడై మాయల
  • హరిదాసులతోడ నల్పులు సరెననరాదు
  • హరిదాసుండగుటే యది
  • హరినామము కడు నానందకరము
  • హరి నీయనుమతో ఆది
  • హరి నీవే బుద్ధిచెప్పి
  • హరి నీవె సర్వాత్మకుడవు
  • హరినెరుగనిపుణ్య మంటేరుగాన
  • హరిభక్తివోడ యెక్కినట్టివారలే కాని
  • హరి యవతారమే ఆతండితడు
  • హరి యవతార మీతడు
  • హరియే ఎరుగును
  • హరి రసమా విహారి
  • హరివారమైతిమి మమ్మవు
  • హరివారమైతిమి మ మ్మవుగాదనగరాదు
  • హరి శరణాగతి యాతుమది
  • హరీ ఆఆఆఆ ఆఆఆఆ
  • హిన దశలు బొంది

sa - స page 72

  • సముఖ ఎచ్చరికవో
  • సర్వజ్ఞత్వము
  • సర్వాంతరాత్ముడవు
  • సర్వేశ్వరుడవు
  • సర్వేశ్వరుడే
  • సర్వోపాయములు జగతి
  • సహజ వైష్ణవాచారవర్తనుల
  • సహజాచారములెల్ల
  • సామాన్యమా పూర్వ
  • సారెకు నానపెట్టకు
  • సారె దూర జాలనూ
  • సారె నిన్నలమేల్మంగ
  • సాసముఖా నడె
  • సింగారమూరితివి
  • సిగ్గరి పెండ్లి
  • సిరిదొలంకెడి
  • సిరుత నవ్వులవాడు
  • సీతాశోకవిఘాతక
  • సుఖమును దుఃఖమును
  • సుగ్రీవ నారసింహ
  • సులభమా మనుజులకు
  • సులభమా యిందరికి
  • సులభుడు మధుసూదనుడు
  • సువ్వి సువ్వి సువ్వాలమ్మా
  • సువ్వి సువ్వి సువ్వి
  • సుముఖ మంగళము
  • సేయనివా డెవ్వడు చిల్లరదోషాలు
  • సేయనివా డెవ్వడు చేరి
  • సేవించరో జనులాల
  • సేవింతురే యితని
  • సేవే భావే శ్రీ
  • సేస పెట్టవయ్యా
  • సొంపుల నీ
  • సొగియునా మఱియు
  • సొరిది సంసారంబు

sa - స page 71

  • సంతగాడ విక
  • సంతలే చొచ్చితిగాని
  • సందడి విడువుము
  • సందెకాడ బుట్టినట్టి
  • సంసారమే మేలు
  • సంసారినైన నాకు
  • సకలం హే
  • సకల జీవులకెల్ల
  • సకలబలంబులు నీవ
  • సకలభూతదయ చాలగ
  • సకలలోక నాధుడు
  • సకల సంగ్రహము
  • సకలశాంతికరము సర్వేశ నీపై భక్తి సర్వేశ
  • సకలశాస్త్రసంపన్నుడట
  • సకలసందేహమై
  • సగము మానిసి రూపు
  • సడిబెట్టె గటకటా
  • సత్యభామ సరసపు
  • సతతం శ్రీశం
  • సతతము నేజేయు
  • సతతవిరక్తుడు
  • సతి చక్కదనమెంతో
  • సతి నిన్ను
  • సతులాల చూడర
  • సదా సకలము

sha - ష page 70

  • షోడసకళానిధికి షోడశోపచారములు

Sa - శ page 69

  • శతాపరాధములు
  • శరణంటి మాతనిసమ్మంధమున
  • శరణంబితడే సకలము
  • శరణాగత వజ్ర
  • శరణు కపీశ్వర
  • శరణువేడెద
  • శరణు శరణు రామచంద్ర
  • శరణు శరణు విభీషణ
  • శరణు శరణు వేద
  • శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీసతి వల్లభా
  • శమముచాలనియట్టిజన్మం
  • శ్రీమన్నారాయణ
  • శ్రీ వేంకటేశ రాజీవాక్ష మేలుకొనవే
  • శ్రీ వేంకటేశ్వరుని సింగారము
  • శ్రీవేంకటేశుడు
  • శ్రీహరి నిత్యశేషగిరీశ
  • శ్రీహరిసేసినచిహ్నలివి
  • శ్రీశో౨యం సుస్థిరో౨యం
  • శోభనమే శోభనమే

va - వ page 68

  • వెఱ్రి మానుప రెవ్వరు వేదురు నాయంత విడువదు
  • వెర్రివాడ వెర్రివాడ వినియు గనియు మర
  • వెర్రివాడు వెర్రిగాడు
  • వెఱ్రివారి దెలుపుటవేవేలు సుకృతము
  • వెలయునిన్నియును
  • వెలయు నీ
  • వెలికీ వెళ్ళడు
  • వెలుపలెల్ల తనలోనుగాక
  • వేంకటాద్రి విభునిబాసి
  • వేంకటగిరి గోవిందుడా
  • వేడుకొందామా
  • వేదం బెవ్వని
  • వేదన బొరలే
  • వేదములే నీ
  • వేదవేద్యులు
  • వేఱొకచోట లేడు వీడివో హరి
  • వేవేలచందాల
  • వేవేలు బంధములు విడువ ముడువబట్టె
  • వేసరకు వీ డేల యనకుము విడువ నిన్నిక శరణు చొచ్చితి
  • వేసరించేదానగాను
  • వేసరితిమెట్ల
  • వేళగాదు సిగ్గులకు

va - వ page 67

  • వివేకమెఱుగనివెఱ్ఱులముగాక
  • వివేకించ వేళ లేదు విజ్ఞానమార్గమందు
  • విశ్వప్రకాశునకు
  • విశ్వరూపమిదివో విష్ణురూపమిదివో
  • విష్ణుడే ఇంతానని
  • విష్ణు దేవు పాదములే
  • వీడివో యిదె
  • వీడె వీడె కూచున్నాడు
  • వీధుల వీధుల విభుడేగేనిద
  • వీణ వాయింఛనే
  • వీనిజూచియైన
  • వైష్ణవులుగానివార
  • వెట్టిమోపువంటిమేను
  • వెట్టి వలపు
  • వెడమంత్ర మికనేల
  • వెదకిన నిదియే
  • వెనక ముందరికి
  • వెనకేదో ముందరేదో వెఱ్రి నేను నా
  • వెన్నలుదొంగిలునాటివెఱ్రివా నీవు
  • వెన్నవట్టుక నేయి
  • వెఱతు వెఱతు
  • వెరపులు నొరపులు
  • వెరవకు మనసా
  • వెఱవకు మనసా
  • వెఱ్రిదెలిసి రోకలి వెస జుట్టుకొన్నట్టు

va - వ page 66

  • వాడెవో ప్రహ్లాదవరదుడు
  • వాడే వాడే
  • వాదులేల చదువులు
  • వాసివంతు విడిచినవాడే
  • వింతలేల సేసేవే
  • విచ్చన విడినె
  • విచ్చలవిదై
  • విచారించు హరి నావిన్నప మవధరించు
  • విచ్చేయరాదా వెలది
  • విచ్చేయవమ్మా
  • విజాతులన్నియు వృథా
  • విడుమనవో రోలు
  • విడువరా దెంతైనా వెఱ్రివాడైన నీకు
  • విడువవిడువనింక
  • విధినిషేధములకు
  • విన్నపాలు వినవలె వింత వింతలు
  • వినరో భాగ్యము విష్ణుకథ
  • విన్నవించితిమి
  • వినుడిదె రఘుపతి
  • విభుడ వింతటికి వెరపుతో ననుగావు
  • విరహపు రాజదె విడిదికి రాగా
  • విరహాన బడలెను
  • విరహ మొక్కందమాయ
  • విఱిగిరి దానవవీరు
  • వివరముమాలినట్టివెర్రిదేహి తొల్లి

va - వ page 65

  • వందే వాసుదేవం
  • వందేహం జగద్వల్లభం
  • వట్టిమోపు మోయనేల వడి ములుగగనేల
  • వట్టియాసలకు లోనై
  • వద్దే గొల్లెత
  • వద్దు నన్ను జెనకకుర
  • వననిధి గురిసినవాన
  • వనిత పాలికిని
  • వనిత భాగ్యంబు
  • వనితలకు బతికి
  • వలచి పైకొనగరాదు
  • వలచిన పతివాడే
  • వలచుటే దోసమా
  • వలదన నొరులకు
  • వలదననొరులకు వశమటవే
  • వలదన నొరులకు వసమటవే
  • వలపు తొలకరించె
  • వలపు లధికము
  • వలపేడ గలిగెనె
  • వలవని మోహావస్థల
  • వలెననువారిదె
  • వాడల వాడల వెంట
  • వాడివో వీడివో హరి వలసిన వారికెల్లా
  • వాడె వేంకటాద్రిమీద
  • వాడె వేంకటేశుడనేవాడె

la - ల page 64

  • లంకెలూడుటే
  • లక్ష్మీకల్యాణము
  • లలిత లావణ్య
  • లాలనుచు నూచెరు
  • లాలి శ్రీ క్రిష్ణయ్య
  • లోకపు నీ
  • లెండో లెండో మాటాలించరో మీరు
  • లేదు బ్రహ్మవిద్యా
  • లేదు భయము మఱి కాదు భవము

ra - ర page 63

  • రంగ రంగ
  • రమ్మనగా దనతో
  • రమ్మనవే ఇకను
  • రసికుడ తిరుపతి
  • రాజీవ నేత్రాయ
  • రాధామాధవరతిచరితమితి
  • రామచంద్రుడితడు రఘువీరుడు
  • రామ దశరథరామ
  • రామభద్ర రఘువీర
  • రామ మిందీవర
  • రామ రామచంద్ర
  • రామ రామ రామకృష్ణ
  • రామా దయాపరసీమా అయోధ్యపుర
  • రాము డిదే లోకాభిరాము
  • రాముడీతడు లోకాభిరాముడీతడు
  • రాముడు రాఘవుడు
  • రాముడు లోకాభిరాముడందరికి
  • రాముడు లోకాభిరాముడు త్రైలోక్య
  • రారా చిన్నన్నా
  • రావే కోడల
  • రూకలై మాడలై
  • రెండుమూలికలు

ya - య page 62

  • యజ్ఞ మూర్తి యజ్ఞ కర్త

m - మ page 61

  • మీకుమీకునమరును
  • మీదమీద వలపెక్కె
  • మునులతపము
  • ముచ్చుగన్నతల్లి
  • ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు
  • ముద్దులు మోమున
  • ముగురువేలుపులకు
  • ముంచినవేడుకతోడ
  • మూడేమాటలు మూడుమూండ్లు
  • మూల మూల నమ్ముడు
  • మూసిన ముత్యాల
  • మెచ్చెనొక రాగంబు
  • మేడలెక్కి నిన్ను
  • మేదిని జీవుల
  • మేర లేని వలపిది
  • మేలు లేదు
  • మేలుకో శృంగారరాయ
  • మేలుకొనవే నీలమేఘ
  • మేలే చెలియా
  • మొత్తకురే అమ్మలాల ముద్దులాడు వీడె
  • మెరుగు వంటిది
  • మొదలుండ గొనలకు
  • మొఱపెట్టెదము
  • మోహంపు రతిముదము
  • మోహము విడుచుటే
  • మోపుల చిగురుల
  • మోసమున మాయావిమోహితుడైపోయి
  • మైలవాసి
  • మొక్కేటి గోపాంగనల

m - మ page 60

  • మరుడు సేసిన
  • మఱి యేపురుషార్థము మావంకలేదు మీకు
  • మఱియు మఱియు
  • మఱి హరిదాసుడై మాయల జిక్కువడితే
  • మతంగ పర్వతామాడ
  • మహి నింతటివారువో
  • మహిమెల్లా
  • మాఱు మోవిదేటికి
  • మాధవా కేశవా మధుసూధనా
  • మాధవా భూధవా
  • మాధవునకు
  • మాన డెన్నడు
  • మాదృశానాం
  • మాకెల్ల
  • మానుషము గాదు
  • మాపుదాకా రేపకాడ
  • మాపులే మరణములు
  • మాటలేల మనసుకు
  • మాయపుదనుజుల
  • మాయలేల సేసేవు
  • మాయామోహము మానదిది
  • మిక్కిలి మేలుది
  • మిక్కిలి విచ్చి
  • మిక్కిలిపుణ్యులు
  • మిన్నక వేసాలుమాని

m - మ page 59

  • మంచి ముహూర్తమున
  • మగవానికేడ సిగ్గు
  • మదమత్సరము
  • మదము దొలకెడి
  • మలసీ జూడరో
  • మరచితిమంటే
  • మర్ద మర్ద
  • మచ్చికతో నేలవయ్య
  • మచ్చ కూర్మ
  • మంగాంబుధి హనుమంతా
  • మంచిదివో సంసారము
  • మందరధర
  • మందులేదు దీనికి
  • మంగళము
  • మనుజుడై పుట్టి మనుజున
  • మనసిజ గురుడితడో
  • మనవి చెప్పితిని
  • మనసిజ సముద్ర
  • మనసు బండారము
  • మనసుకు మనసె
  • మనసున నెప్పుడు
  • మహినుద్యోగి కావల
  • మరుని నగరిదండ
  • మరలి మరలి జయమంగళము
  • మరిగి వీరెపో

bh - భ page 58

  • భక్త సులభుడును పరతంత్రుడు హరి
  • భక్తికొలది వాడే పరమాత్ముడు
  • భక్తినీపై దొకటె పరమసుఖము
  • భళి భళి రామ
  • భారమైన వేపమాను
  • భావమున బరబ్రహ్మమిదె
  • భావములోనా బాహ్యమునందును
  • భావమెరిగిన నల్లబల్లి
  • భావయామి గోపాలబాలం
  • భావించి తెలుసుకొంటే
  • భావించి నేరనైతి పశుబుద్ది నైతిని
  • భూమిలోన గొత్తలాయ బుత్రోత్సవ మిదివో
  • భ్రహ్మకడిగిన పాదము ో
  • భామనోచిన నోము ఫలము
  • భామ శృంగారించు భావమే
  • భోగము నేను
  • భోగిశయనమును బుసకొట్టెడిని
  • భోగీంద్రులును మీరు

b - బ page 57

  • బండి విరిచి పిన
  • బడలెను పానుపు
  • బడి బడి తిరిగాడీ
  • బయలు పందిలి వెట్టి
  • బలుపుడు హరి
  • బలువగుకర్మము లివివో
  • బలువగు దనరూపము చూపెన్
  • బ్రహ్మకడిగిన పాదము
  • బాపు దైవమా మాపాలిభవమా
  • బాలులతో వీథుల్లో
  • బృవంతి బౌద్ధా బుద్ధ
  • బోధకు లెవ్వరు లేక
  • బోధింపరే యెరిగినబుధులాల పెద్దలాల

ph - ఫ page 56

  • ఫాలనేత్రానల ప్రబల

p - ప page 55

  • పుడమి నిందరి
  • పురుషుండని శ్రుతి
  • పురుషోత్తమ నీవే
  • పురుషోత్తముడ నీవు పురుషాధముడ నేను
  • పురుషోత్తముడ నీవే పుణ్యము గట్టుక నన్ను
  • పులుగు చెప్పెడి నదె పొంచి మాగురుడు నీకు
  • పూచిన యీదేహము పువ్వుగాని పిందెగాని
  • పృథుల హేమ
  • పెంచబెంచ మీద
  • పెంచి తమపెట్టుజెట్టు పెరికివేయ రెవ్వరు
  • పెక్కులంపటాల
  • పెట్టిననీ వెఱుగుదు పెనుదిక్కు
  • పెద్దలు మీరంతేసి
  • పేరంటాండ్లు పాడరే
  • పెరిగినాడు చూడరో
  • పెరుగపెరుగ బెద్దలుగాగ
  • పెట్టిననీ వెఱుగుదు
  • పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా
  • పొడవైన శేషగిరి
  • పొత్తుల మగడవు
  • పొదలె నిండు కళల
  • పొద్దికనెన్నడు వొడచునొ పోయిన చెలిరాదాయను
  • పొరి నీకును
  • పొలతి జవ్వనామున
  • పోయం గాలము
  • పోయ గాలం
  • పోయగాలం బడవికిగాయు
  • పోయబోయ గాలమెల్ల
  • పోయబోయ గాలమెల్ల పూట పూటకు
  • పోరాక పోయి
  • పోరొ పోరొ

p - ప page 54

  • పాటించి నమ్మిన వారి భాగ్యముగాదా
  • పాటెల్లా నొక్కచో నుండు
  • పాడేము నేము
  • పాడరే సోబనాలు
  • పాపపుణ్యముల పక్వ
  • పాపపుణ్యముల రూపము
  • పాపపుణ్యముల రూపము దేహమిది దీని
  • పాపినైన నాపాల
  • పాపములే సంబళమెపుడూ
  • పాపమెరంగని
  • పాప మెఱగను పుణ్యఫల మెఱగను
  • పాయక మతినుండి
  • పాయని కర్మంబులె
  • పాయపుమదములబంధమా
  • పారకుమీ వోమనసా
  • పారితెంచి యెత్తివేసి
  • పాలదొంగవద్ద
  • పిడికిట తలంబ్రాల
  • పిల్ల గ్రోవి
  • పిలువా గదరే
  • పుండు జీవులకెల్ల
  • పుట్టినట్టె వున్న వాడ పోలేదు రాలేదు
  • పుట్టుగులమ్మీ భువి
  • పుట్టుమాలినబరుబోకివి
  • పుట్టుభోగులము నేము

p - ప page 53

  • పరమపాతకుడ
  • పరమ యోగీశ్వరుల
  • పరమాత్మ నిన్నుగొల్చి
  • పరమాత్ముడైన హరి
  • పరమాత్ముని నోరబాడుచును
  • పరిపూర్ణుడవు నీవు
  • పరిపూర్ణగరుడాద్రి
  • పరులకైతే నిదే
  • పరులసేవలు
  • పరుసము సోకక పసిడౌనా
  • పరుసము సోకియు
  • పరుసమొక్కటే కదా
  • పలపారగించవమ్మ
  • ప్రలపనవచనైః
  • పలికెటి వేదమె
  • పలుకుతేనియలను
  • పలుకు దేనెల తల్లి పవళించెను
  • పలుమరు వుట్ల పండుగను
  • పలువిచారములేల పరమాత్మనీవు నాకు
  • పసలేని యీబ్రదుకు
  • పసిడి చీరవాడావు
  • పసిడియక్షంతలివె పట్టరో వేగమె రారో
  • పసులు గాచేటి
  • ప్రాణనాయకుడు
  • ప్రాణులనేరమి

p - ప page 52

  • పంకజాక్షులు సొలసిపలికి
  • పంటల భాగ్యులు
  • పండియు బండదు
  • పంతగాడు మిక్కిలి
  • పంతములాడెదమా
  • పట్టినచోనే వెదకి
  • పట్టినదెల్లా
  • పట్టిన వారల
  • పట్టరో వీదుల బరువులు వెట్టి
  • పట్టము గట్టితివింక
  • పట్టవసముగాని
  • పటుశిష్టప్రతిపాలకుడ
  • ప్రతిలేని పూజదల పంగకోటి మణుగులై
  • పదిలము కోట
  • పనిమాలినట్టి
  • పనిలేనిధనవాంఛ
  • పనివడి యింద్రియాలే
  • ప్రపన్నులకు
  • పరగీ నిదివో
  • పరగుబహుజన్మ
  • పరదేశిపట్టణమున
  • పరమజ్ఞానులకు
  • పరమ పురుష
  • పరమ పురుష నిరుపమాన
  • పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు

n - న page 51

  • నెయ్యములలో నేరెళ్ళో
  • నెరవాది సాహసులు
  • నెలత చక్కదనమే
  • నెలమూడు శోభనాలు
  • నేడు దప్పించుకొంటేను నేరుపున్నదా
  • నే ననగా నెంతవాడ నెయ్యపుజీవులలోన
  • నేనెంత చిన్ననైనా
  • నేనెంత నీవెంత
  • నేనెంతవాడను
  • నేనెందువోయె తానెందువోయీ
  • నేనెయనగనేలా నీ మనసూ
  • నేనే బ్రహ్మము కోనేరము॥ నేము
  • నే నేమిసేయుదును
  • నే నొక్కడ లేకుండితే నీకృపకు బాత్ర మేది
  • నేరిచిబ్రదికేవారు
  • నేర్పుకంటె బెన్నిధి
  • నేరుపరి ననుకోను
  • నేల మిన్ను

n - న page 50

  • నీమహిమో నాలోన
  • నీదాస్యమొక్కటే నిలిచి నమ్మగలది
  • నీయంతటివా రెవ్వరు నీకు నెదురేది యెందు
  • నీయంతవారు గారు నిండుసామర్థ్యము లేదు
  • నీయాధీనము లింతే నిఖిలప్రపంచమును
  • నీవెంత నేనెంత నీకు నాకు నెంతదవ్వు
  • నీ విభుడు
  • నీవే నేరవుగాని
  • నీవే కావింక
  • నీవే మూలమువో
  • నీవుదేవుడవు
  • నీవేకాని యింక
  • నీవేకా చెప్పజూప
  • నీవేల సిగ్గుపడేవు
  • నీ వేలికవు
  • నీవేమి సేతువయ్య
  • నీవెరగనిది లేదు
  • నీవనగ నొకచోట
  • నీపాపమే కాదు
  • నీరువట్టు గొన్నవేళ
  • నీయాజ్ఞ దలమోచి
  • నీయంత వాడనా
  • నీయంతటివారెవ్వరు
  • నూతులు దవ్వగబోతే బేతాళములు పుట్టె
  • నెయ్యని పోసుకోరాదు

n - న page 49

  • నాతప్పు లోగొనవే
  • నిత్య పూజలివిగో నెరిచిన నోహో
  • నిత్యాయ విబుధసంస్తుత్యాయ
  • నిత్యాత్ముడై యుండి
  • నిత్యానంద ధరణీధర
  • నిత్య సుఖానంద
  • నిత్యులు ముక్తులు
  • నిలుపుటద్దములోన
  • నిలు నిలు దగ్గరకు
  • నిచ్చనిచ్చ సోబనాలు
  • నిగమనిగమాంతవర్ణిత
  • నిముషమెడతెగక హరి
  • నిజమో కల్లో
  • నిక్కించీ గర్ణములు
  • నిన్ను దూరక
  • నిన్నుదలచి నీపేరు
  • నిన్నుబాసినయట్లు
  • నిందలేని పతివిదె
  • నిండు మనసే
  • నీమహత్త్వంబు లోనికి
  • నీకేమయ్య నీకు
  • నీకేల భయము
  • నీకథామృతము
  • నీదాసుల భంగములు
  • నీమహి మది యెంత నీవు చేసేచేత లెంత

n - న page 48

  • నరులాల మునులాల
  • నరులారా నేడువో
  • నల్లని మేని
  • నవనారసింహా
  • నవనీతచోర
  • నవనీతచోర నమో నమో
  • నవరసములదీ
  • నవరూప ప్రహ్లాద
  • నవ్వవే యెక్కడి
  • నాలం వా
  • నానాటి బదుకు నాటకము
  • నానాదిక్కుల
  • నారాయణతే
  • నాకు నందు కేమివోదు నన్ను నీ వేమి చూచేవు
  • నారాయణాచ్యుతానంత గోవింద హరి
  • నారాయ ణాచ్యుతానంత గోవిందా
  • నారాయణ నీనామమెగతి
  • నారాయణ నీనామము
  • నారాయణాయ నమో
  • నారాయణుడీతడు నరులాల
  • నాపాలిఘన దైవమవు
  • నాటకమింతా
  • నామోము చూచిచూచి
  • నాటికి నాడే
  • నాటికి నాడు

n - న page 47

  • నంతలే చొచ్చితిగాని సరకు గాననైతి
  • నంద నందన
  • నందకధర
  • నగధర నందగోప
  • నగవులు నిజమన
  • నగు మొగము తోడి
  • నగుబాట్లబడేనాజిహ్వా
  • నడువరో జడియక
  • నదులొల్లవు
  • నటనల భ్రమయకు
  • నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ
  • నన్ను నెవ్వరు గాచేరు నాటిపగెంతురుగాక
  • నమామ్యహం మానవ
  • నమామ్యహం మానవసింహం
  • నమిత దేవం
  • నమ్మిన దొకటే నాకు నీశరణము
  • నమో నమో జగదేకనాథ
  • నమో నమో దశరథ
  • నమో నమో దానవవినాశక
  • నమో నమో రఘుకుల
  • నమో నమో లక్ష్మీ నరసింహా
  • నమో నారాయణ నావిన్నపమిదివో
  • నమో నారాయణాయ
  • నమో నారాయణాయ సగుణ
  • నరసింహ రామకృష్ణ

dh - ధ page 46

  • ధృవవరదా సంస్తుతవరదా

d - ద page 45

  • దేవశిఖామణివి దిష్టదైవమవు
  • దేవుడుగలవారికి దిగులు
  • దేవునికి దేవికిని తెప్పల
  • దేహము దా నస్థిరమట
  • దేహినిత్యుడు దేహము
  • దైవక్రుతమెవ్వరికి
  • దైవకృతంబట చేతట
  • దైవమా నీకు వెలితా
  • దైవమా నీమాయ తామొలెఱగనీదు
  • దైవమా పరదైవమా
  • దైవము నీవే గతి
  • దైవము నీవే యిక దరి చేరుతువుగాక
  • దైవము పుట్టించినట్టి
  • దొరకునా యితనికృప
  • దొరకెగా పూజ కందువ
  • దొరకె మాపాలికి గందువయర్థము
  • దొరతో సంగాతము దొరికిన
  • దోమటి వింతెరుగరా

d - ద page 44

  • దండనున్న చెలుల
  • దయజూడవయా తతిగాని
  • దాచుకో నీపాదాలకుదగ నే జేసినపూజ లివి
  • దాసోహ మనుబుద్ది దలచరు దానవులు
  • దిక్కిందరికినైనదేవుడు
  • దిక్కునీవే జీవులకు
  • దినము ద్వాదశి నేడు
  • దిబ్బలు వెట్టుచు
  • దీనుడనేను దేవుడవు నీవు
  • దురితదేహులే తొల్లియును
  • ద్రువవరదా సంస్తుతవరదా
  • దృష్టితాకు మాఅయ్యకు
  • దేవతలు గెలువరో
  • దేవ దేవం భజే దివ్యప్రభావం
  • దేవదేవు డెక్కెనదె
  • దేవ దేవొత్తమ తే
  • దేవదేవోత్తముని తిరుతేరు
  • దేవ నమో దేవా
  • దేవ నీదయ యెంతునో దివ్యసులభ మెంతునో
  • దేవ నీమాయతిమిర
  • దేవ నీవిచ్చేయందుకు
  • దేవ యీ తగవు
  • దేవరగుణములు దెలియవు
  • దేవర చిత్తం
  • దేవశిఖామణి దివిజులు