idiyE ramayOga middariki - ఇదియే రమయోగ మిద్దరికి

ఇదియే రమయోగ (రాగం: ) (తాళం : )
ఇదియే రమయోగ మిద్దరికి విభుడా
అదన ననిచన ద్రిస్శ్తాంత మాయనిపుడు ||

వెలి మన మిద్దరము వేరై వుందుము గాని
తలపు లోపలను ఇద్దర మొకతే
వొలసి యుద్దములోన నొకరూపే రెండై
తెలిసినట్లనేపో ద్రిస్శ్తాంతమిపుడు ||

పేరులిద్దరికి నిట్టె భేదమైతో చీగాని
తారుకాణ గుణము లిద్దరి కొకతే
కోరిన మాటొకటే కొండశలలో రెండవు
తేరి చూడనిది యేవో ద్రిస్శ్తాంతమిపుదు ||

శ్రీ వేంకటేశ నీనా చేతవే వేరులుగాని
కేవలిద్దరికి కాగిలి వొకటే
పూవు గుత్తి వొకటే పూపలు వేరైనట్ట్లు
దేవ యిన్నిటికి నిదె ద్రిస్శ్తాంత మిపుడు ||
idiyE ramayOga (Raagam: ) (Taalam: )
idiyE ramayOga middariki vibhuDA
adana nanichana drisStAMta mAyanipuDu ||

veli mana middaramu vErai vuMdumu gAni
talapu lOpalanu iddara mokatE
volasi yuddamulOna nokarUpE reMDai
telisinaTlanEpO drisStAMtamipuDu ||

pEruliddariki niTTe bhEdamaitO chIgAni
tArukANa guNamu liddari kokatE
kOrina mATokaTE koMDaSalalO reMDavu
tEri chUDanidi yEvO drisStAMtamipudu ||

SrI vEMkaTESa nInA chEtavE vErulugAni
kEvaliddariki kAgili vokaTE
pUvu gutti vokaTE pUpalu vErainaTTlu
dEva yinniTiki nide drisStAMta mipuDu ||

0 comments:

Post a Comment