అంగన నిన్నడిగి - aMgana ninnaDigi

అంగన నిన్నడిగి (రాగమ్: ) (తాలమ్: )

ప|| అంగన నిన్నడిగి రమ్మనె నీమాట |
సంగతిగ మరుమాట సరి నాన తీవయ్యా ||

చ|| చెలులచే నింతి నీకు చెప్పిపంపిన మాటలు |
తలచుకొన్నాడవా దయతో నీవు |
తొలుత గాను కంపిన దొడ్డ పూవుల బంతి |
లలిమించిన పరిమళము గొంటివా ||

చ|| చాయల నాసతో నాపె సారె జూచిన చూపులు |
ఆయములు గరచేనా అంటుకొనెనా |
చేయెత్తి సిగ్గుతోడ చేరి మొక్కిన మొక్కులు |
ఆయనా నీకు శలవు అందరిలోనా ||

చ|| బెరసి తెరమాటున బెట్టిన నీపై సేసలు |
శిరసుపై నిండెనా చిందెనా నీపై |
అరుదై శ్రీ వేంకటేశ అలమేలుమంగ యీకె |
గరిమ నిన్ను గూడి గద్దెపై గూచున్నది ||


aMgana ninnaDigi (Raagam: ) (Taalam: )

pa|| aMgana ninnaDigi rammane nImATa |
saMgatiga marumATa sari nAna tIvayyA ||

ca|| celulacE niMti nIku ceppipaMpina mATalu |
talacukonnADavA dayatO nIvu |
toluta gAnu kaMpina doDDa pUvula baMti |
lalimiMcina parimaLamu goMTivA ||

ca|| cAyala nAsatO nApe sAre jUcina cUpulu |
Ayamulu garacEnA aMTukonenA |
cEyetti siggutODa cEri mokkina mokkulu |
AyanA nIku Salavu aMdarilOnA ||

ca|| berasi teramATuna beTTina nIpai sEsalu |
Sirasupai niMDenA ciMdenA nIpai |
arudai SrI vEMkaTESa alamElumaMga yIke |
garima ninnu gUDi gaddepai gUcunnadi ||

0 comments:

Post a Comment