అక్కరకొదగనియట్టి - akkarakodaganiyaTTi

అక్కరకొదగనియట్టియర్థము (రాగం: ) (తాళం : )
ప|| అక్కరకొదగనియట్టియర్థము | లెక్క లెన్నియైనా నేమి లేకున్న నేమిరే ||

చ|| దండితో దనకుగానిధరణీశురాజ్యంబు | యెండెనేమి యది పండెనేమిరే |
బెండుపడ గేశవుని బేరుకొననినాలికె | వుండెనేమి వుండకుండెనేమిరే ||

చ|| యెదిరి దన్ను గాననియెడపులగుడ్డికన్ను | మొదల దెఱచెనేమి మూసెనేమిరే |
వెదకి శ్రీపతిసేవ వేడుక జేయనివాడు | చదివెనేమి చదువు చాలించెనేమిరే ||

చ|| ఆవల నెవ్వరులేని అడవిలోనివెన్నెల | కావిరి గాసెనేమి కాయకున్ననేమిరే |
శ్రీవేంకటేశ్వరు జేరనిధర్మములెల్ల | తోవల నుండెనేమి తొలగిననేమిరే ||

akkarakodaganiyaTTiyarthamu (Raagam: ) (Taalam: )
pa|| akkarakodaganiyaTTiyarthamu | lekka lenniyainA nEmi lEkunna nEmirE ||

ca|| daMDitO danakugAnidharaNISurAjyaMbu | yeMDenEmi yadi paMDenEmirE |
beMDupaDa gESavuni bErukonaninAlike | vuMDenEmi vuMDakuMDenEmirE ||

ca|| yediri dannu gAnaniyeDapulaguDDikannu | modala derxacenEmi mUsenEmirE |
vedaki SrIpatisEva vEDuka jEyanivADu | cadivenEmi caduvu cAliMcenEmirE ||

ca|| Avala nevvarulEni aDavilOnivennela | kAviri gAsenEmi kAyakunnanEmirE |
SrIvEMkaTESvaru jEranidharmamulella | tOvala nuMDenEmi tolaginanEmirE ||

0 comments:

Post a Comment