అంగడి నెవ్వరు - aMgaDi nevvaru

అంగడి నెవ్వరు నంటకురో (రాగమ్: ) (తాలమ్: )
ప|| అంగడి నెవ్వరు నంటకురో యీ- |
దొంగలగూడిన ద్రోహులను ||

చ|| దోసము దోసము తొలరో శ్రీహరి- |
దాసానదాసుల దగ్గరక ఆసలనాసల హరినెరుగక చెడి |
వీసరపోయిన వెర్రులము ||

చ|| పాపము పాపము పాయరో కర్మపు- |
దాపవువారము దగ్గరక |
చేపట్టి వేదపు శ్రీహరి కథలు |
యేపొద్దు విననిహీనులము ||

చ|| పంకము పంకము పైకొనిరాకురో |
కొంకుగొసరులకూళలము |
వేంకటగిరిపై విభునిపుణ్యకథ |
లంకెల విననియన్యులము ||

aMgaDi nevvaru naMTakurO (Raagam: ) (Taalam: )

pa|| aMgaDi nevvaru naMTakurO yI- |
doMgalagUDina drOhulanu ||

ca|| dOsamu dOsamu tolarO SrIhari- |
dAsAnadAsula daggaraka AsalanAsala harinerugaka ceDi |
vIsarapOyina verrulamu ||

ca|| pApamu pApamu pAyarO karmapu- |
dApavuvAramu daggaraka |
cEpaTTi vEdapu SrIhari kathalu |
yEpoddu vinanihInulamu ||

ca|| paMkamu paMkamu paikonirAkurO |
koMkugosarulakULalamu |
vEMkaTagiripai viBunipuNyakatha |
laMkela vinaniyanyulamu ||

0 comments:

Post a Comment